For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐర్లాండ్‌పై గెలిచిన అనంతరం ధోనీ స్పందన, టెస్ట్ కెప్టెన్సీపై...

By Srinivas

హోమిల్టన్: ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు వరుస విజయాల పైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం స్పందించారు. ఐర్లాండ్‌తో మ్యాచ్ గెలిచిన అనంతరం ధోనీ మాట్లాడాడు. భారత బౌలర్ల పైన ప్రశంసల వర్షం కురిపించాడు. బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారన్నాడు. జట్టుగా రాణిస్తే అద్భుత ఫలితాలు వస్తాయన్నాడు.

వరుసగా ఐదు మ్యాచులలో ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేయడం పైన ధోనీ సంతోషం వ్యక్తం చేశాడు. పిచ్‌తో సంబంధం లేకుండా మన బౌలర్లు రాణిస్తున్నారన్నాడు. పరుగులకు అడ్డుకట్ట వేస్తూనే కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నారని కితాబిచ్చాడు. బౌలర్లు ఇచ్చిన స్ఫూర్తిని మన బ్యాట్స్‌మెన్ కొనసాగిస్తున్నారన్నాడు.

Praise for bowlers, same team with difference: What Dhoni said after India crushed Ireland at World Cup

బౌలర్లు అద్భుతంగా రాణించారని చెప్పారు. వారు అద్భుతంగా రాణిస్తే తనకు తన పని నిర్వర్తించడం చాలా సులభం అవుతుందని చెప్పారు. బౌలర్లు ప్రణాళికతో బౌలింగ్ చేశారన్నారు. ప్రపంచ కప్ ముందు ముక్కోణపు సిరీస్‌తో పోలిస్తే బౌలర్ల ప్రదర్శన చాలా మెరుగైందన్నాడు. స్పెషలిస్ట్ బౌలర్లు, స్పిన్నర్లతో పాటు పార్ట్ టైం బౌలర్లు బాగా రాణిస్తున్నారన్నాడు.

టెస్ట్ కెప్టెన్సీ వదిలేయడం ద్వారా వన్డే పైన మరింత దృష్టి సారించవచ్చుననే అభిప్రాయంతో ధోనీ విభేదించారు. టెస్టులో, వన్డేలో దాదాపు ప్లేయర్లు ఒక్కటేనని చెప్పారు. భారత్‌కు చెందిన అభిమానులు పెద్ద ఎత్తున తమకు మద్దతు పలుకుతున్నారన్నాడు. పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ జరిగిందని, అప్పటి నుండి అభిమానులు వెంటే ఉన్నారని, ఇది అద్భుతమన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+