Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఇండియ‌న్స్ కంటే ముందే డెక్క‌న్ చార్జ‌ర్స్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌.. ఓజా ఆస‌క్తిక‌ర కామెంట్స్‌

Pragyan Ojha says Rohit Sharma would’ve captain Deccan Chargers before Mumbai Indians had it not been for auction

2011లో మెగా వేలం లేక‌పోయి ఉంటే ముంబై ఇండియ‌న్స్ కంటే ముందే డెక్క‌న్ చార్జ‌ర్స్‌కు రోహిత్ శ‌ర్మ కెప్టెన్ అయ్యే వాడ‌ని టీమిండియా మాజీ స్పిన్న‌ర్ ప్ర‌జ్ఞాన్ ఓజా అన్నాడు. 2009లో డెక్క‌న్ చార్జ‌ర్స్ ట్రోఫి గెలిచిన జ‌ట్టులో రోహిత్ శ‌ర్మ‌, ప్ర‌జ్ఞాన్ ఓజా స‌భ్యులుగా ఉన్నారు. దీంతో నాటి ప‌రిస్థితుల‌ను తాజాగా ఓజా వివ‌రించాడు.

అత‌డిలోని కెప్టెన్సీని రాటు తేల్చాడు

అత‌డిలోని కెప్టెన్సీని రాటు తేల్చాడు

బ్యాట‌ర్‌గా రోహిత్ శ‌ర్మ అసాధార‌ణ ప్లేయ‌ర్ అంటూ ప్ర‌జ్ఞాన్ ఓజా కొనియాడాడు. రోహిత్ శ‌ర్మ దేశ‌వాళీ క్రికెట్‌లోనూ ఎప్పుడూ కెప్టెన్సీ చేయ‌లేద‌ని, కానీ హిట్‌మ్యాన్‌లోని కెప్టెన్సీ ల‌క్ష‌ణాల‌ను నాటి డెక్క‌న్ చార్జ‌ర్స్ కెప్టెన్ ఆడ‌మ్ గిల్ క్రిస్ట్ గుర్తించిన‌ట్లు ఆయ‌న చెప్పాడు. రోహిత్ శ‌ర్మ‌ను గిల్ క్రిస్ట్ ఎప్పుడూ కూడా థింక్ ట్యాంక్ పొజిషన్‌లో పెట్టేవాడ‌ని చెప్పాడు.

ఈ క్ర‌మంలో అత‌నిలోని బ్యాటింగ్‌, ఒత్తిడిని ఫేస్ చేయడం వంటివి గిల్‌క్రిస్ట్ గ‌మ‌నించిన‌ట్లు తెలిపాడు. దీంతో హిట్‌మ్యాన్‌లోని కెప్టెన్సీని రాటు తేల్చేందుకును అత‌నికి క‌ష్ట‌మైన ప‌నుల‌ను అప్ప‌గించి, వాటిని పూర్తి చేయ‌డంలో రోహిత్ శ‌ర్మ స్కిల్స్‌ను గిల్ క్రిస్ట్ గ‌మ‌నించేవాడ‌ని ప్ర‌జ్ఞాన్ ఓజా చెప్పాడు.

డెక్క‌న్ చార్జ‌ర్స్ కెప్టెన్ అయ్యేవాడు

డెక్క‌న్ చార్జ‌ర్స్ కెప్టెన్ అయ్యేవాడు

క్లిష్ట‌మైన ప‌నుల‌ను పూర్తి చేసే క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ ఇచ్చిన సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను బ‌ట్టి అత‌నిలోని కెప్టెన్ సిద్ధ‌మ‌య్యాడ‌ని, జ‌ట్టును న‌డిపించ‌డానికి అత‌డు సిద్ధంగా ఉన్నాడ‌ని గిల్ క్రిస్ట్ చెప్పిన‌ట్లు ప్ర‌జ్ఞాన్ ఓజా తెలిపాడు. 2011లో క‌నుక మెగా వేలం లేక‌పోయి ఉంటే ఆ సంవ‌త్స‌ర‌మే రోహిత్ శ‌ర్మ డెక్క‌న్ చార్జ‌ర్స్ కెప్టెన్ అయి ఉండే వాడ‌ని చెప్పుకొచ్చాడు.

ఇక మెగా వేలంలో ఏ ప్లేయ‌ర్ ఏ జ‌ట్టుకు వెళ్తాడ‌నేది చెప్ప‌లేమ‌న్న ఓజా.. స‌చిన్ టెండూల్క‌ర్ త‌ర్వాత త‌మ జ‌ట్టును రోహిత్ శ‌ర్మ న‌డిపించ‌గ‌ల‌డ‌ని ఆ స‌మ‌యంలో ముంబై ఇండియన్స్ భావించింద‌ని అందుకే అత‌డిని వేలంలో భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన‌ట్లు తెలిపాడు.

భారీ ధ‌ర‌కు కొనుగోలు

భారీ ధ‌ర‌కు కొనుగోలు

కాగా 2011 మెగా వేలంలో రోహిత్ శ‌ర్మ‌ను ముంబై ఇండియ‌న్స్ 9 కోట్ల 20 ల‌క్ష‌ల రూపాయ‌ల భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. 2022 వ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్ అత్య‌ధిక ధ‌ర వెచ్చించి కొనుగోలు చేసిన ఆట‌గాడిగా రోహిత్ శ‌ర్మ‌నే ఉన్నాడు. ఇక అప్ప‌టి నుంచి ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ ముంబై ఇండియ‌న్స్‌కే ప్రాతినిధ్యం వ‌హించాడు.

2013లో తొలిసారిగా కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టి తొలి సారే జ‌ట్టుకు ట్రోఫి అందించాడు. ఆ స‌మ‌యంలో ప్ర‌జ్ఞాన్ ఓజా కూడా ముంబై జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్‌కు రోహిత్ శ‌ర్మ 5 ట్రోఫీలు అందించాడు. హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో ముంబై ఇండియ‌న్స్ 2013, 2015, 2017, 2019, 2020 సీజ‌న్లలో క‌ప్ గెలిచింది. తాజా సీజ‌న్లోనూ ముంబై మ‌రోసారి ట్రోఫిపై క‌న్నేసింది.

ముంబై ఇండియ‌న్స్ పూర్తి జ‌ట్టు 2022

ముంబై ఇండియ‌న్స్ పూర్తి జ‌ట్టు 2022

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్), కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, టిమ్ డేవిడ్, జయదేవ్ ఉనద్కత్, టైమల్ మిల్స్, జోఫ్రా ఆర్చర్, రిలే మెరెడిత్, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, బాసిల్ థంపి, అన్మోల్‌ప్రీత్ సింగ్, డెవాల్డ్ బ్రీవిస్, తిలక్ వర్మ, ఆర్యన్ జుయల్ (వికెట్ కీప‌ర్), అర్జున్ టెండూల్కర్, రమణదీప్ సింగ్, రాహుల్ బుద్ధి, హృతిక్ షోకీన్, సంజయ్ యాదవ్, అర్షద్ ఖాన్.

Story first published: Tuesday, April 5, 2022, 16:19 [IST]
Other articles published on Apr 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+