ఒక్క టీ20 ఆడలేదు, వేలంలో రూ 4.8 కోట్లు పలికాడు: ఎవరీ ప్రభ్ సిమ్రాన్ సింగ్


ఐపీఎల్ 12వ సీజన్ కోసం వేలం ముగిసింది. ప్రాంఛైజీలు యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. మొత్తం 1003 మంది ప్లేయర్లు ఈ వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా, ప్రాంఛైజీల సూచన మేరకు 351 మంది తుది జాబితాకు ఎంపిక చేశారు. ఇందులో 228 మంది భారత ఆటగాళ్లున్నారు.
70 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకునేందుకు 8 ఫ్రాంచైజీలు పోటీపడగా 60 మందిని కొనుగోలు చేశాయి. ఇందులో 40 మంది భారత్ నుంచి కాగా 20 విదేశీ ఆటగాళ్లున్నారు. వీళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ. 106.8 కోట్లు ఖర్చు చేశాయి. ఈ వేలంలో కొందరు యువ ఆటగాళ్ల పంట పండింది.

టీనేజ్ కుర్రాళ్లు ఈ వేలంలో విపరీతంగా
దేశవాళీలో ఆడిన అనుభవం పెద్దగా లేకపోయినా ఇద్దరు టీనేజ్ కుర్రాళ్లు ఈ వేలంలో విపరీతంగా ఆకర్షించారు. పంజాబ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ 17 ఏళ్ల ప్రభ్ సిమ్రాన్ సింగ్‌ను రూ. 4.80 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేయగా, 15 ఏళ్ల ప్రయాస్ రే బర్మన్‌ను బెంగళూరు రూ. 1.50 కోట్లకు దక్కించుకుంది.

ఫ్రాంచైజీలు మాత్రం రూ.కోట్లకు
వీరిద్దరూ కనీసధర రూ. 20 లక్షలతో వేలంలో ఉన్నప్పటికీ ఫ్రాంచైజీలు మాత్రం రూ.కోట్లకు సొంతం చేసుకున్నాయి. ఈ వేలంలో రూ. 4.80 కోట్లు పలికిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం. టీవలి అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో 37 బంతుల్లోనే 65 పరుగులు చేసి వెలుగులోకి వచ్చాడు.
4 లిస్ట్-ఎ మ్యాచ్‌లే ఆడిన ప్రభ్ సిమ్రాన్ సింగ్
ప్రభ్ సిమ్రాన్ సింగ్ కేవలం 4 లిస్ట్-ఎ మ్యాచ్‌లే ఆడాడు. పటియాలాకు చెందిన ప్రభ్ సిమ్రాన్ సింగ్‌ను వేలంలో దక్కించుకునేందుకు అనేక ప్రాంఛైజీలు పోటీ పడినప్పటికీ చివరకు రేసులో పంజాబ్ నిలిచింది. అమృతసర్ వేదికగ ఈ ఏడాది మొదట్లో జరిగిన పంజాబ్ అండర్-23 టోర్నమెంట్‌లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ 301 బంతుల్లో 298 పరుగులతో డబుల్ సెంచరీని సాధించాడు.

ప్రభ్ సిమ్రాన్ సింగ్ మరోవరో కాదు
ప్రభ్ సిమ్రాన్ సింగ్ మరోవరో కాదు అన్మోల్‌ప్రీత్ సింగ్ కజిన్. మంగళవారం జరిగిన వేలంలో అన్మోల్‌ప్రీత్ సింగ్‌ను ముంబై ఇండియన్స్ రూ. 80 లక్షలకు వేలంలో సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే వేలానికి ముందు రోజు బరోడాతో రంజీ మ్యాచ్‌లో ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదిన ముంబై బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేని బెంగళూరు రూ.5 కోట్లకు సొంతం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications