
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పవర్‌పుల్ బౌలింగ్ ఎటాక్ కోహ్లీసేన బ్యాటింగ్ లైనప్‌ను ఒత్తిడిలోకి నెడుతుందని ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరిస్ ముగిసిన తర్వాత కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికా పర్యనటకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా జనవరి 5న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గ్రేమ్ స్మిత్ గురువారం మీడియాతో మాట్లాడాడు.
'ఏబీ డివిలియర్స్ రాకతో దక్షిణాఫ్రికా జట్టు పటిష్టంగా ఉంది. సఫారీల బౌలింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మ్యాచ్ గతినే మార్చేయగల నలుగురు అత్యుత్తమ పేసర్లు ఉన్నారు. వీరికి తోడు యువ పేసర్లు అదనం. నా అంచనా ప్రకారం తుది జట్టులో ముగ్గురు సీమర్లు, ఒక స్పిన్నర్ (కేశవ్ మహారాజ్) ఆడతాడు. ఆరుగురు బ్యాట్స్‌మెన్లు, డికాక్‌తో కలిపి ఏడుగురు. దీనిని చూస్తుంటే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్టంగా ఉంది' అని అన్నాడు.
కేప్ టౌన్‌లో తొలి టెస్టు మ్యాచ్‌ని షెడ్యూల్ చేయడం వెనుక కారణాన్ని కూడా స్మిత్ వెల్లడించాడు. కేప్ టౌన్‌లో జరిగే తొలి టెస్టులో టీమిండియా ఓడించి సిరిస్ ఆరంభంలోనే ఒత్తిడిలోకి నెట్టొచ్చనేది సఫారీల ప్లాన్‌గా స్మిత్ అభివర్ణించాడు. కేప్‌టౌన్ భారత్‌కు మంచి ఛాన్స్ అని, ఈ పిచ్ బౌన్స్‌కు అనుకూలం కాబట్టి పేసర్ల సత్తా చాటే అవకాశం ఉందన్నాడు.
రెండో టెస్టు జరిగే ప్రిటోరియా, మూడో టెస్టు జరిగే జోహెన్స్ బర్గ్‌లు టీమిండియా పెద్ద ఛాలెంజ్‌గా నిలుస్తాయని స్మిత్ అన్నాడు. కాగా, కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వరుసగా తొమ్మిది టెస్టులను గెలిచి మంచి ఊపు మీద ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో జరిగే టెస్టు సిరిస్‌ను గెలిచి ప్రపంచ రికార్డుని నెలకొల్పాని ఊవిళ్లూరుతోంది.
ఈ నేపథ్యంలో గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా కోహ్లీసేనకు ధీటుగా బదులిస్తుందని చెప్పడం విశేషం. 'దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీసేన ఎదుర్కొనే ప్రధాన సమస్య పరుగులు సాధించడం. టీమిండియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది కాబట్టి మంచి స్కోరు చేసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంది. నిజంగా ఇదొక అద్భుతమైన సిరిస్. ఇరు జట్లలో మంచి ఆటగాళ్లు ఉన్నారు. ప్రపంచం ఎదురుచూస్తున్న ఆతృతమైన టెస్టు సిరిస్ ఇదేనేమో' అని స్మిత్ అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.