Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌‌లో నెంబర్. 2 ప్రత్యేకత: ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్..?

కోల్‌కత్తా: అంతా కలిసొస్తే మే 24 (ఆదివారం)నాడు ముంబై ఇండియన్స్ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛాంపియన్‌గా అవతరిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఐపీఎల్‌లో నాకౌట్ దశలో జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే ఇదే జరిగిందని అంటున్నారు.

ఐపీఎల్‌లో 2010 నుంచి 2014 వరకు ముంబై ఇండియన్స్ జట్టు మంచి ప్రదర్శనను కనబరుస్తూ వచ్చింది. ఇప్పటికే ఐపీఎల్ 2015లో ఫైనల్స్‌కు చేరింది. క్వాలిఫయిర్ 1లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.

గత నాలుగు సీజన్లుగా పాయింట్లపట్టికలో ఏ జట్టైతే రెండో స్ధానంలో నిలిచిందో ఆ జట్టు ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. కాగా, ఒకే ఒక్కసారి మాత్రమే పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.

Power of No. 2: Mumbai Indians could win IPL 2015

గత ఏడు సంవత్సరాలుగా ఐపీఎల్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో నెంబర్. 1 స్ధానంతో పోలిస్తే నెంబర్. 2 స్ధానానికున్న ప్రత్యేకత వేరు. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ దశలో అత్యంత చెత్త ప్రదర్శనను కనబర్చిన ముంబై ఇండియన్స్ లీగ్ దశ ముగిసే సమయానికి పుంజుకుని పాయింట్ల పట్టికలో 2వ స్ధానంలో నిలిచింది.

ఇది రోహిత్ శర్మ నేతృత్వంలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. 2013లో ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించిన ముంబై ఇండియన్స్, మళ్లీ మరోసారి టైటిల్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

2013లో ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 2వ స్ధానంలో ఉండటం విశేషం. ఇక పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్ధానాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

లీగ్ దశలో ఐపీఎల్ ఛాంపియన్లుగా అవతరించిన జట్లు:

* 2008 - Rajasthan Royals (No. 1)
* 2009 - Deccan Chargers (No. 4)
* 2010 - Chennai Super Kings (No. 3)
* 2011 - CSK (No. 2)
* 2012 - Kolkata Knight Riders (No. 2)
* 2013 - MI (No. 2)
* 2014 - KKR (No. 2)
* 2015 - ?

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+