Stephen Fleming On Powe Cut issue: దురదృష్టం మా నెత్తిన ఉంటే మేమేం చేస్తాం

ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లో పవర్ కట్ వల్ల తొలి రెండు ఓవర్లలో డీఆర్‌ఎస్‌లు లేకుండానే మ్యాచ్ నిర్వహించారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్ డానియల్ సామ్స్ వేయగా.. ఆ ఓవర్ రెండో బంతికే డెవాన్ కాన్వేని అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ఔటిచ్చాడు. ఆ బంతి వికెట్లకు లెగ్ సైడ్ వెళ్తున్నట్లు కన్పించింది. కానీ పవర్ కట్ వల్ల రివ్యూ తీసుకునే వీలు లేకపోవడంతో కాన్వే నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. రెండో ఓవర్ నాలుగో బంతికి రాబిన్ ఊతప్ప సైతం ఎల్బీడబ్ల్యూ ఔట్ కాగా అప్పుడు కూడా చెన్నై డీఆర్ఎస్ తీసుకోలేకపోయింది. రెండో ఓవర్ తర్వాత రివ్యూలు అందుబాటులోకి వచ్చాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం చెన్నైకి జరిగిపోయింది. దీనిపై క్రికెట్ ప్రముఖుల నుంచి సీరియస్ కామెంట్లొస్తున్నాయి. వీరేంద్ర సెహ్వాగ్ సైతం బీసీసీఐపై ఫైర్ అయ్యారు. తాజాగా ఈ విషయమై సీఎస్కే ప్రధాన కోచ్ ఫ్లెమింగ్ స్పందించారు.

కచ్చితంగా ఇదైతే మంచి ప్రారంభం కాదు
ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. 'మాకు ఇలా జరగడం దురదృష్టకరం. పవర్ కట్ అయిన టైంలోనే ఆ ఎల్బీడబ్ల్యూ జరగడంతో మేము చాలా నిరాశ చెందాం. ఈ ఘటన మ్యాచ్‌లో భాగమా కాదా అనే విషయమై ఎటూ తేల్చుకోలేకపోతున్నాం. ఏదేమైనప్పటికీ మాకు ఆ సంఘటన తర్వాత మా బ్యాటింగ్‌లో ఏమాత్రం అనుకూలం లేని విషయాలు జరిగాయి. మేము ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. ఇదైతే కచ్చితంగా మంచి ప్రారంభం కాదు' అని మ్యాచ్ అనంతర సమావేశంలో ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.

మావాళ్లు ఇంకా గేమ్ నేర్చుకుంటున్నారు
సీఎస్కే స్క్వాడ్‌లోని ఆటగాళ్లు తమ గేమ్ ఇంకా నేర్చుకుంటున్నారని, ముంబై మ్యాచ్‌లో జరిగిన అనుభవం తదుపరి కొన్ని మ్యాచ్‌లలో వారికి సహాయపడుతుందని ఫ్లెమింగ్ అన్నాడు. ఇకపోతే ఓ జట్టుకు అత్యుత్తమ సీజన్, అత్యంత చెత్త సీజన్ మధ్య ఉండే వ్యత్యాసం ఎప్పుడూ చాలా తక్కువ మార్జినే అని పేర్కొన్నారు. తద్వారా పాయింట్ల పట్టికలో స్థానం గురించి పెద్దగా చింతించాల్సిన పనిలేదని, భవిష్యత్తులో తప్పకుండా జట్టు రాణిస్తుందని అతను నొక్కి వక్కాణించాడు.

వచ్చే రెండు మ్యాచ్‌లలో పుంజుకుంటాం
ఇంకా ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. 'చాలా జట్ల మాదిరిగానే మేము ఇంకా మా స్క్వాడ్ తుది కూర్పు గురించి పరిశీలన చేస్తున్నాం. నేర్చుకున్నదాని నుంచి రాబోయే రెండు మ్యాచ్‌లలో మేము పుంజుకుని ముందుకు సాగగలమని ఆశిస్తున్నాం. నేను చెప్పగలిగేది ఏమిటంటే.. ఒక జట్టుకు గొప్ప సీజన్, పేలవ సీజన్ మధ్య ఉండే తేడా కేవలం చాలా చిన్న విషయాల్లోనే ఉంటుంది. ఈ సీజన్లో మేము తెలుసుకున్నదదే. కాబట్టి మేము ఇంకా ఎక్కువ ఆలోచించడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ యూనిట్లలో మేము ఇంకా మెరుగుపడాల్సి ఉంది.' అని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications