For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

West Indies vs Ireland: క్రికెట‌ర్ల‌కు క‌రోనా.. నేడు జ‌ర‌గాల్సిన మ్యాచ్ వాయిదా

Postponed West Indies vs Ireland 2nd One Day Match Due to Corona Virus

క్రికెట్ ప్ర‌పంచాన్ని క‌రోనా క‌ల‌వ‌ర పెడుతోంది. ఇప్ప‌టికే కోవిడ్ కార‌ణంగా ప‌లు మ్యాచ్‌లు వాయిదా ప‌డ్డాయి. తాజాగా వెస్టిండీస్, ఐర్లాండ్ మ‌ధ్య నేడు జ‌ర‌గాల్సిన రెండో వ‌న్డే మ్యాచ్ కూడా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని వెస్టిండీస్, ఐర్లాండ్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా ప్ర‌క‌టించాయి. తాజాగా ఐర్లాండ్ క్రికెట్ జ‌ట్టులో ఇద్ద‌రు ఆట‌గాళ్లు క‌రోనా బారిన ప‌డ్డారు. దీనికి తోడు మ‌రో ఇద్దరు గాయ‌ప‌డ్డారు. ఇదివ‌ర‌కు క‌రోనా బారిన ప‌డ్డ వారితో క‌లుపుకుని మొత్తం ఐదుగురు ఆట‌గాళ్లు క‌రోనా కార‌ణంగా ఐసోలేష‌న్‌లో ఉంటున్నారు. దీంతో నేటి మ్యాచ్‌ను వాయిదా వేయ‌క త‌ప్ప‌లేదు. జ‌మైకాలో ఈ మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది.

మిగ‌తా మ్యాచ్‌ల‌పై రెండు రోజుల్లో నిర్ణ‌యం

మిగ‌తా మ్యాచ్‌ల‌పై రెండు రోజుల్లో నిర్ణ‌యం

ఈ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక వ‌న్డే మ్యాచ్ మాత్ర‌మే ముగిసింది. మ‌రో రెండు వ‌న్డే మ్యాచ్‌ల‌తోపాటు టీ20 మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌పై వెస్టిండీస్, ఐర్లాండ్ క్రికెట్ బోర్డులు మ‌రో రోజుల్లో నిర్ణ‌యం తీసుకోనున్నాయి. ఐర్లాండ్ ఆట‌గాళ్లు ఆండ్రూ బల్బిర్నీ, వికెట్ కీపర్ లోర్కాన్ టక్కర్ గ‌త వార‌మే క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా పాల్ స్టిర్లింగ్, సిమి సింగ్, బెన్ వైట్‌కు వైర‌స్ పాజిటివ్‌గా నిర్దార‌ణ అయింది. అంతేకాకుండా ఐర్లాండ్ హెడ్ కోచ్ డేవిడ్ రిప్లీ కూడా క‌రోనాతో చికిత్స పొందున్నారు. కాగా ఐర్లాండ్ స్పిన్ బౌలర్ ఆండీ మెక్‌బ్రైన్, ఫాస్ట్ బౌలర్ మార్క్ అడైర్ గాయాల బారిన ప‌డ్డారు.

ఐర్లాండ్‌ను వ‌ద‌ల‌ని క‌రోనా

ఐర్లాండ్‌ను వ‌ద‌ల‌ని క‌రోనా

క‌రోనా కార‌ణంగా ఐర్జాండ్ జ‌ట్టు యూఎస్ఏ ప‌ర్య‌ట‌నను ఇప్ప‌టికే ర‌ద్దు అయింది. అక్క‌డ క‌రోనా కేసులు భారీగా న‌మోదవడంతో సిరీస్‌ను వాయిదా వేశారు. అనంత‌రం యూఎస్ నుంచే ఐర్లాండ్ జ‌ట్టు నేరుగా వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరింది. అక్క‌డి నుంచి బ‌య‌లుదేరే ముందే ఐర్లాండ్ జ‌ట్టులో క‌రోనా కల‌క‌లం రేపింది. ఆ జ‌ట్టులోని ఇద్దరు ఆట‌గాళ్లు వైర‌స్ బారిన ప‌డ్డారు. తాజాగా మ‌ళ్లీ క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇలా ఐర్లాండ్ జ‌ట్టు ఎక్క‌డికెళ్లినా ఆ జ‌ట్టును క‌రోనా మ‌హమ్మారి వ‌దిలి పెట్ట‌డం లేదు.

Ranji Trophy 2022 : 7 Players Tested Positive For Covid-19 | Oneindia Telugu
తొలి వ‌న్డేలో విండీస్ విజ‌యం

తొలి వ‌న్డేలో విండీస్ విజ‌యం

కాగా మూడు వ‌న్డే సిరీస్‌లో భాగంగా ఇప్ప‌టికే తొలి వ‌న్డే మ్యాచ్ ముగిసింది. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్ 24 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జ‌ట్టు 269 ప‌రుగ‌లకు ఆలౌట్ అయింది. అనంత‌రం ల‌క్ష్యాన్ని చేధించ‌లేక ఐర్లాండ్ 245 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది.

Story first published: Tuesday, January 11, 2022, 11:40 [IST]
Other articles published on Jan 11, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+