For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

11,400 కోట్ల కుంభకోణం: పీఎన్‌బీ బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లీ కొనసాగేనా?

Post Nirav Modi fraud accusation, Virat Kohli to end ties with Punjab National Bank?

హైదరాబాద్: భారతదేశంలో అత్యధిక రెవెన్యూ సంపాదిస్తోన్న బ్యాంకులలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి. ప్రముఖుల ఘనకార్యం వల్ల కొద్ది రోజులుగా మీడియా నోళ్లలో నలుగుతుంది. నిరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు రూ. 11,400వరకు భారీ మోసం చేసి పారిపోయినట్లు సమాచారం రావడంతో బ్యాంకు వార్తల్లోకెక్కింది.

16ఏళ్ల వయస్సులో అకౌంట్ తెరిచి:

16ఏళ్ల వయస్సులో అకౌంట్ తెరిచి:

విరాట్ కోహ్లీ తన పదహారేళ్ల వయస్సున్నప్పటి నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతాదారుడు. అంతేగాక అతను 2016 సంవత్సరం నుంచి బ్యాంకుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. దీంతో అందరినీ ఇదే బ్యాంకులో ఖాతాలు ఓపెన్ చేయమంటూ సలహాలిచ్చే వారిలో ఒకడిగా ఉండేవాడు. ఇప్పుడు బయటపడిన మోసంతో తన ఆలోచన మార్చుకోవాలని యోచిస్తున్నాడు.

11,400 కోట్లు కొట్టేశాడని సుప్రీంకు ఫిర్యాదు:

11,400 కోట్లు కొట్టేశాడని సుప్రీంకు ఫిర్యాదు:

నిరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకు దగ్గర నుంచి దాదాపు 11,400 వరకు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పును చెల్లించకుండా విదేశాలకు పారిపోయాడంటూ వదంతులు వచ్చాయి. బాధితులు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సమ్మతించిన సుప్రీం కోర్టు విచారణ నిమిత్తం వజ్రాల వ్యాపారి నిరవ్ మోడీకి నోటీసులు పంపగా విషయం వెలుగులోకి వచ్చింది.

12 చోట్ల సోదాలు జరిపి:

12 చోట్ల సోదాలు జరిపి:

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి)లో చోటు చేసుకున్న భారీ కుంభకోణం నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) రంగంలోకి దిగింది. నీరవ్ మోడీ ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ సోదాలు జరిపింది. దాదాపు నీరవ్ మోడీకి చెందిన 12 చోట్ల ఈ సోదాలు జరిపినట్లు సమాచారం. కుంభకోణానికి సంబంధించి ఈడి ఇదివరకే నీరవ్ మోడీపై, తదితరులపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న అధికారులపై చర్యలకు ఉపక్రమించింది.

బ్యాంకు షేర్లు పడిపోయి:

బ్యాంకు షేర్లు పడిపోయి:

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్యాలయాల్లో సైతం ఈడి అధికారులు సోదాలు చేపట్టారు. కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్లు 8.47 శాతం పడిపోయాయి. నక్షత్ర, గీతాంజలి, గిన్నీ జువెల్లర్స్ ట్రేడింగ్ విధానంపై సెబీ విచారణ జరుపుతోంది.

ఆమ్రపాలి గ్రూప్ నుంచి:

ఆమ్రపాలి గ్రూప్ నుంచి:

కన్‌స్ట్రక్షన్ నేపథ్యంగా ఉన్న ఆమ్రపాలి గ్రూప్‌కు అంబాసిడర్‌గా ధోనీ కొన్నాళ్లు వ్యవహరించాడు. ఎప్పుడైతే ఆ వ్యాపారం ప్రాజెక్టులు తదితర విషయాల్లో మోసం చేస్తున్నట్లు తెలిసిందే అప్పటి నుంచి ధోనీ దాని నుంచి వైదొలిగాడు.

Story first published: Wednesday, February 21, 2018, 11:53 [IST]
Other articles published on Feb 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+