For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డాడీ డ్యూటీలోకి ధోనీ, కూతురు జీవా జుట్టుని ..

Post CSK Win, MS Dhoni Back To Daddy Duty. Does Daughter Zivas Hair In Adorable Video

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా బుధవారం చెన్నై, బెంగుళూరుల మధ్య రసవత్తర పోరు ముగిసింది. ఈ మ్యాచ్‌లో 34 బంతుల్లో 70పరుగులు చేసి ఛేదనలో దిగిన చెన్నై జట్టుకు మంచి విజయాన్ని అందించాడు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. ఈ విజయం గురించి చెన్నై, అతని అభిమానులు మరిచిపోనేలేదు. అప్పుడే ధోనీ డాడీ డ్యూటీలోకి చేరిపోయాడు. సరదాగా కూతురు జీవా హెయిర్‌ను డైయ్యర్‌తో ఆరబెడుతూ సరదాగా గడిపాడు. ఈ వీడియోను అతని ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు.

వీడియోను పోస్టు చేసిన 57నిమిషాల్లో 7.2 లక్షల వరకూ వీక్షకులను సంపాదించింది. ఇంకా 8లక్షల మంది వరకూ కామెంట్లు పెట్టారు. ఆ ఫొటోకు ఓ నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. కెప్టెన్, ఫాదర్, ఆల్ రౌండర్ అంటే తాలా.. ధోనీనే అని స్పందించాడు.

బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ జట్టు టాస్ ఓడి ముందు బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ కోహ్లీ పరుగులేమీ సాధించకపోయినా.. డివిలియర్స్, డికాక్‌లు బౌండరీలను సాధించి జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో చెన్నై జట్టుకు 206 పరుగుల టార్గెట్ ఇచ్చారు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ధనాదన్ ధోనీ సేన అంతే స్థాయిలో సిక్సుల వర్షం కురిపించింది. ధోనీ ఒక్కడే ఏడు సిక్సులు కొట్టాడు. మ్యాచ్ మొత్తంలో 33సిక్సులు రావడం ఐపీఎల్ లోనే కొత్త రికార్డుగా నమోదైంది.

ఈ మ్యాచ్‌లో మరో ప్రధాన ఆకర్షణగా ధోనీ, కోహ్లీ, సురేశ్ రైనా, ఇమ్రాన్ తాహిర్ భార్యలు స్టేడియంకు వచ్చి మ్యాచ్ ను నేరుగా వీక్షించారు. ఇక అనుష్క శర్మ, సాక్షిలు ప్రతి సిక్సుకు పలికించిన హావభావాలు కెమెరా కళ్లు ఒడిసి పట్టడంతో మ్యాచ్ మరింత వినోదాన్ని పంచింది.

Story first published: Thursday, April 26, 2018, 16:33 [IST]
Other articles published on Apr 26, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+