Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెళ్లి పీటలెక్కబోతున్నసన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు

 Popular Sunrisers Hyderabad cricketer Sandeep Sharma gets engaged

హైదరాబాద్: నెలల వ్యవధిలో భారత క్రికెటర్లు పెళ్లి పీటలెక్కుతున్నారు. అందులోనూ దాదాపు ప్రస్తుతం ప్రేమ పెళ్లిల్ల ట్రెండే నడుస్తోంది. ఈ క్రమంలోనే మరో భారత క్రికెటర్‌ పెళ్లికి సిద్ధమైయ్యాడు. ఐపీఎల్‌ 2018 సీజన్‌కు గాను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన బౌలర్‌ సందీప్‌ శర్మ తన ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించాడు.

ట్విటర్‌ వేదికగా తనకు కాబోయే శ్రీమతి ఫొటోను గురువారం అధికారికంగా ప్రకటించాడు. ఆ పోస్టులో.. తను చేసుకోబోతున్న అమ్మాయితో కలిసి దిగిన ఫొటోను సందీప్‌ అభిమానులతో పంచుకున్నాడు. 'ఇట్స్‌ అఫీషియల్‌' అని పేర్కొన్న సందీప్‌ పక్కనే ఉంగరం గుర్తును జత చేశాడు. సందీప్‌ చేసుకోబోయే అమ్మాయి పేరు 'తాషా సాత్విక్‌'గా తెలుస్తోంది.

ఆమె జ్యూయలరీ డిజైనర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరూ ఎప్పటి నుంచో స్నేహితులు. తాషా సాత్విక్ సోషల్ మీడియా తరచూ యాక్టిక్‌గానే కనిపిస్తుంటారు. అంతేకాదు ఆమె వృత్తిపరంగానూ సోషల్ మీడియాను మంచి మాద్యమంగా వాడుకుంటారు. ఈ నేపథ్యంలోనే సందీప్ శర్మతో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూనే ఉన్నారు.

2013 నుంచి ఐపీఎల్‌ ఆడుతోన్న సందీప్‌ శర్మ 10వ సీజన్ వరకు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేయడంతో కేన్ విలియమ్‌సన్ కెప్టెన్సీలో ఆడిన సందీప్‌ 12 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు దక్కించుకున్నాడు. జట్టులో సిద్ధార్థ్ కౌల్, భువనేశ్వర్ కుమార్‌లు ఉండటంతో.. బౌలింగ్ చేసేందుకు చాలా తక్కువ అవకాశాలు వచ్చినా.. వాటిని చేజిక్కుంచుకున్నాడు. భారత్‌ తరఫున సందీప్‌ ఇప్పటి వరకు రెండు టీ20లు ఆడాడు. 2015లో జింబాబ్వేపై సందీప్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

Story first published: Friday, June 8, 2018, 14:16 [IST]
Other articles published on Jun 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+