Rickey Ponting: టీ20 వరల్డ్‌కప్ ఇండియా జట్టులో వాళ్ల కన్నా వీళ్లు ఉంటే బెటర్..! ప్లేయింగ్ 11లో ఎవరంటే?

టీ20 ప్రపంచకప్‌కు టైం దగ్గర పడుతున్న కొద్దీ భారత జట్టులో పోటీ తీవ్రతరమవుతోంది. భారత తుది జట్టులో ఎవరు రెగ్యులర్ ప్లేయర్లుగా ఉంటారనే విషయమై సందిగ్ధత నెలకొంది. ఆటగాళ్ల ఎంపిక కూడా చాలా టఫ్ అయిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారత జట్టు బెంచ్ సామర్థ్యం ఏ రేంజులో ఉందో. ఇక టీ20 జట్టులో జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దాదాపు తమ స్థానాలను పదిలం చేసుకున్నట్లే. అయితే ఇటీవల ఫామ్ వల్ల కోహ్లీ ఎంపిక అవుతాడా కాడా అనేది తేలాలి. ఇక భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్ మిగిలిన రెండు పేసర్ల స్థానాల కోసం పోటీపడుతున్నారు. ఇక వికెట్ కీపర్ స్థానం కోసం రిషబ్ పంత్, సంజు శాంసన్, దినేష్ కార్తీక్, ఇషాన్ కిషన్ మధ్య పోటీ నెలకొంది.

హార్దిక్, జడేజా, సూర్య దాదాపుగా ఫిక్స్
హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా తమ ప్రస్తుత ఫామ్‌ను కొనసాగించగలిగితే వారిద్దరూ తుది జట్టులో ఉండే అవకాశముంది. సూర్యకుమార్ యాదవ్ సైతం ఫాంలో ఉంటే అతను కూడా పక్కాగా తుది జట్టులో ఉంటాడు. దీన్ని బట్టి.. రోహిత్, కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్రా జడేజా, బుమ్రా, చాహల్ దాదాపుగా ప్లేయింగ్ 11లో ఉండొచ్చు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో పంత్ మిస్ ఫైర్ అవ్వడంతో ఇక వికెట్ కీపర్‌గా ఎవరినీ ఎంచుకోవాలనే విషయమై చర్చ నడుస్తోంది.

నాకు అతని సత్తా ఏంటో తెలుసు, చివర్లో అతను ఆడాలి
ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, పంత్, దినేష్ కార్తీక్‌లలో తాను ఎవరిని ఎంపిక చేస్తాడో చెప్పాడు. '50ఓవర్ల క్రికెట్‌లో రిషబ్ పంత్ సత్తా ఏమిటో మనం చూశాం. టీ20 గేమ్‌లో అతని సత్తా ఏమిటో నాకు బాగా తెలుసు. దినేష్ కార్తీక్ ఇటీవలే అతని అత్యుత్తమ ఐపీఎల్ ఫాంను కలిగి ఉన్నాడు. నేను వీరిద్దరిని తుది జట్టులో ఉంచాలని కోరుకుంటాను. రిషబ్ పంత్ బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్ 3 నుంచి నంబర్ 5 మధ్య ఆడ్డానికి ఓకే. ఇక చివర్లో దినేష్ కార్తీక్ మరియు హార్దిక్ పాండ్యా ఉంటే బాగుంటుంది. ఫినిషింగ్ చేసేవాళ్లు సరిగా ఉంటే బ్యాటింగ్ లైనప్ బాగున్నట్లు. భారత బ్యాటింగ్ లైనప్ భీకరంగా కన్పిస్తోంది' అని ఐసీసీ రివ్యూ షోలో పాంటింగ్ పేర్కొన్నాడు.

తుది జట్టు ఇలా.. బెంచ్ ప్లేయర్లు వీరు
ఇకపోతే చాలా మంది క్రికెట్ ప్రముఖులు విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించాలని పేర్కొంటుండడంతో అతని స్థానంలో (నంబర్ 3స్థానంలో) తుది జట్టులో ఎవరు దిగితే బాగుంటుందనేది కాస్త ఆసక్తికరంగా మారింది. ఇక నెటిజన్లు, టీమిండియా క్రికెట్ అభిమానుల ప్రకారం.. అతని స్థానంలో సంజూ శాంసన్ బరిలోకి దిగితే బాగుంటుందని పేర్కొంటున్నారు. ఇక ఓవరాల్‌గా ఓ లుక్కేస్తే.. టీ20 వరల్డ్ కప్ జట్టు ఇలా ఉండొచ్చు.
ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్రాజడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్
ఇక మిగతా నలుగురు బెంచ్ ప్లేయర్లు : దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్

విరాట్ కోహ్లీ ఎంపిక కాకపోతే..?
విరాట్ కోహ్లీ ఎంపిక కాకపోతే అతని స్థానంలో సంజూ శాంసన్ ఎంపికవ్వొచ్చు, లేకపోతే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరిగి దినేష్ కార్తీక్ తుది జట్టులోకి రావొచ్చు. ఇక ఆ టైంలో గాయాల వల్ల ప్లేయర్లకు ఇబ్బంది ఎదురైతే ఓపెనర్ల లిస్టులో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ సిద్ధంగా ఉన్నారు. మిడిలార్డర్లో దీపక్ హుడా, శ్రేయస్ అయ్యార్, రాహుల్ త్రిపాఠి, స్పిన్నర్ల లిస్టులో అశ్విన్, రవి బిష్ణోయ్, పేసర్ల లిస్టులో అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ అందుబాటులో ఉన్నారు. ఏదేమైనా వరల్డ్ కప్‌కు ఇండియా టీంను ప్రకటించడం కత్తి మీద సాములాంటిదేనని చెప్పొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications