Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోని అందరికి ఆదర్శప్రాయుడు: రికీ పాంటింగ్

Ricky Ponting
మెల్‌బోర్న్‌: రెండు అత్యుత్తమ జట్టు మధ్య క్రికెట్‌ పోరు రసవత్తరంగా ఉంటుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టన్‌ రికీ పాంటింగ్‌ చెప్పాడు. భారత - ఆస్ట్రేలియా మధ్య క్రికెట్‌ ఎప్పుడు జరిగినా అది అద్భుతంగా ఉంటుందని రికీ పాంటింగ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ రెండు జట్ల మధ్య ఏ ఫార్మట్‌లో క్రికెట్‌ ( ట్వంటీ, వన్డే, టెస్ట్‌) జరుగుతున్న అభిమానులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తుంటారని రికీ తెలిపాడు. సాధారణంగా భారత జట్టుతో ఆడే సమయంలో ఎంతో తేడా ఉంటుందన్నాడు. ఈ మార్పు వేరే జట్టుతో ఆడుతున్నప్పుడు ఉండదని అన్నాడు. ' ఇరుజట్లు పోటీ పడుతున్నప్పుడు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇదే విషయాన్ని ధోని కూడా అనేక సందర్భాల్లో వ్యక్తపరిచాడు.

అయితే ఈ సంవత్సరంలో జరగబోయే సీరీస్‌లో వారు ఏ స్థాయిలో ఆడతారో చూడాలి." అని పాంటింగ్‌ చెప్పాడు. 10 సంవత్సరాల నుంచి భారత - ఆస్ట్రేలియా మధ్య ఉన్న ఆహ్లదకరమైన పోటీ వాతావరణం ఇపుడు కూడా ఉంటుందని ఆయన అన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనలో ఉన్నది. దాని తరవాత దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంటుంది. మెల్‌బోర్న్‌లో బాక్సింగ్‌ డే నాడు ప్రారంభం కానున్న భారత - ఆస్ట్రేలియా సీరీస్‌ కన్నా ముందు ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టుల్లో పాల్గొంటుంది.

ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో అంపైర్‌ నిర్ణయం ప్రకారం అవుట్‌ అయిన ఇయాన్‌ బెల్‌ను మళ్లీ ఆడేందుకు అంగీకరించిన ధోని నాయకత్వ లక్షణాన్నిరికీ పొగిడాడు.దోని ప్రకటన చాలా ప్రేరణనని ఇచ్చిందని చెప్పాడు. ధోని సదా మంచి ఆటను ఆడేందుకు ఇష్టపడతాడని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి సంఘటనలు చరిత్రలో నిలుస్తామన్నాయని ధోనిని పాంటింగ్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. చివరిసారిగా భారత్‌ 2007 -08లో ఆస్ట్రేలియా పర్యటించింది. టీమిండియా కెప్టన్‌గా అనిల్‌ కుంబ్లే ఆ సమయంలో జట్టుకు నాయకత్వం వహించాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+