ట్వంటీ 20లో భారత్ ను ఎదుర్కుంటాం: పాంటింగ్
ముంబయి: ట్వంటీ 20 ప్రపంచ కప్ గెలిచిన జట్టును ఎదుర్కోవడానికి తాము ఉత్సాహం చూపుతున్నామని అస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు ట్వంటీ 20 మ్యాచ్ జరగనుంది. 50 ఓవర్ల వన్డే మ్యాచుల కన్నా ట్వంటీ మ్యాచ్ గురించి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని పాంటింగ్ శుక్రవారం మీడియా ప్రతినిధలతో అన్నారు.
తమ ఆటగాళ్ల పట్ల ఇక ముందు జాతిపరమైన దూషణలు జరగవని భావిస్తున్నానని ఆయన అన్నారు. వడదొరా, ముంబయి వన్డే మ్యాచుల సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు సైమండ్స్ ను కొంత మంది ప్రేక్షకులు జాతిపరంగా దూషించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దూషణలు తననెంతో అసంతృప్తికి గురి చేశాయని పాంటింగ్ అన్నారు.
Story first published: Friday, October 19, 2007, 23:53 [IST]
Other articles published on Oct 19, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications