For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి మహిళా అంఫైర్‌గా చరిత్ర సృష్టించనున్న పొలోసాక్

త్వరలో మైదానంలోకి మహిళా అంఫైర్లు కనిపించనున్నారు.ఇప్పటికే మహిళాలు ఆడే క్రికెట్ మ్యాచ్‌ల్లో దర్శనమిస్తోన్న అంఫైర్లు త్వరలో పురుషుల మ్యాచ్‌‌లకి కూడా అంపైరింగ్ చేయబోతున్నారు.

By Nageshwara Rao

హైదరాబాద్: త్వరలో మైదానంలోకి మహిళా అంఫైర్లు కనిపించనున్నారు. ఇప్పటికే మహిళాలు ఆడే క్రికెట్ మ్యాచ్‌ల్లో దర్శనమిస్తోన్న అంఫైర్లు త్వరలో పురుషుల మ్యాచ్‌‌లకి కూడా అంపైరింగ్ చేయబోతున్నారు.

Polosak set to create history as female umpire in Australia

తాజాగా ఆస్ట్రేలియాకి చెందిన మహిళా అంపైర్ క్లారీ పొలోసాక్‌ ఓ పురుషుల మ్యాచ్‌కి అంపైరింగ్‌ చేసి చరిత్ర సృష్టించనుంది. 29 ఏళ్ల పొలోసాక్ ఆస్ట్రేలియా ఎలెవన్, న్యూ సౌత్ వేల్స్ మధ్య ఆదివారం (అక్టోబర్ 8) జరిగిన మ్యాచ్‌కి అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించనుంది.

పురుషుల ఫస్ట్‌క్లాస్ స్థాయి మ్యాచ్‌ల్లో ఒక మహిళ అంపైర్‌గా పనిచేనుండటం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. 'నేను ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు. కానీ.. క్రికెట్ అంటే ఇష్టం. మ్యాచ్‌లు చూస్తుండేదాన్ని. ఈ ఆసక్తిని గమనించిన మా నాన్న నన్ను ఓ అంపైర్ కోర్సులో చేర్చారు' అని సిడ్నీలో తెలిపింది.

'పురుషుల ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌కి అంపైరింగ్ చేసే అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నాను. క్రికెట్ న్యూ సౌత్ తరుపున అంఫైర్‌గా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. ఈ రంగంలో నేను మెరుగ్గా రాణించగలిగితే మరి కొంత మందికి మార్గదర్శకంగా ఉంటుంది' అని పొలోసాక్ వెల్లడించింది.

అతి తక్కువ కాలంలోనే ఎలైట్ లెవల్ స్థాయికి పొలోసాక్ చేరుకోగలిగిందని, ఇదే ప్రతిభని ఆమె కొనసాగిస్తే పురుషుల అంతర్జాతీయ మ్యాచ్‌లకి కూడా ఆమె అంపైరింగ్ చేయగలదని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ ధీమా వ్యక్తం చేశారు. కేవలం మూడు సీజన్లలోనే ఆస్ట్రేలియా లీడింగ్ అంఫైర్ల జాబితాలో చోటు దక్కించుకుందని కొనియాడారు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+