Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పొలార్డ్ డబుల్ ఇస్మార్ట్..ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్.. సిక్సర్ల వర్షం (Video)

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్న ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ అదరగొడుతున్నాడు. శనివారం లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరాచీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. బౌండరీ లైన్‌లో స్టన్నింగ్ క్యాచ్‌తో పాటు మెరుపు అర్ధశతకం సాధించాడు. 33 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఒక బౌండరీతో పాటు అయిదు సిక్సర్లు బాదాడు.

లాహోర్ ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో మీర్ హంజా బౌలింగ్‌లో జహందాద్ ఖాన్ సిక్సర్‌కు ప్రయత్నించాడు. బౌండరీ లైన్‌లో ఉన్న పొలార్డ్ గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. కానీ బ్యాలెన్స్‌ను నియంత్రించుకోలేక బౌండరీ లైన్‌ను దాటాడు.ఈలోపు గ్రౌండ్‌లోకి బంతిని గాల్లోకి విసిరి, తిరిగి వచ్చి పొలార్డ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ వికెట్‌తో లాహెర్ ఒత్తిడిలోకి వెళ్లింది.

Pollard double smart in PSL.. taking stunning catch with one hand and rain of sixes

తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 175 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (72; 45 బంతుల్లో) టాప్ స్కోరర్. 54 పరుగులకే లాహోర్ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జహందాద్‌తో కలిసి ఫర్హాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ పొలార్డ్ కళ్లుచెదిరే క్యాచ్‌కు జహందాద్ ఔటయ్యాడు. ఆఖర్లో జార్జ్ లిండే (26; 13 బంతుల్లో)తో కలిసి ఫర్హాన్ దూకుడుగా ఆడాడు.

అనంతరం ఛేదనలో ఖలందర్స్ ఆఖరి బంతికి విజయం సాధించింది. చివరి రెండు బంతులకు విజయానికి ఒక్క పరుగు అవసరమవ్వగా హసన్ అలీ (9; 5 బంతుల్లో) ఔటయ్యాడు. కానీ ఆఖరి బంతి మీర్ హంజా సింగిల్ తీసి జట్టును గెలిపించాడు. అయితే ఛేజింగ్‌లో కరాచీ 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. కట్ చేస్తే కరాచీ స్కోరు 139/4.

పొలార్డ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.షోయబ్ మాలిక్ (39; 32 బంతుల్లో) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. సిక్సర్లతో హోరెత్తిస్తూ స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Story first published: Sunday, February 25, 2024, 9:50 [IST]
Other articles published on Feb 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+