For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ క్యాష్ రిచ్ టీ20‌ లీగ్‌లో ఆడడానికి పొలార్డ్, పూరన్, బ్రావో సంతకాలు

pollard

కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, అలాగే వెస్టిండీస్ వైట్-బాల్ కెప్టెన్ నికోలస్ పూరన్ క్యాష్ రిచ్ లీగ్ అయిన యూఏఈలోని ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఆడడానికి సైన్ చేశారు. ఈ లీగ్‌ను మెజారిటీ టీంలను ఐపీఎల్ ఫ్రాంచైజీలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ లీగ్ జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది గ్లోబల్ టీ20స్టార్లు ఈ లీగ్‌లో పాల్గొనడానికి తమ పేరు నమోదు చేసుకున్నారు. ఈ లీగ్ ప్రారంభ ఎడిషన్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఇక ఈ టీం మార్క్యూ ప్లేయర్‌ల జాబితాలో పొలార్డ్, బ్రావో, పూరన్‌లు చేరారు. ఈ మేరకు అక్కడి మీడియాలో ప్రకటనలొచ్చాయి. ఈ ముగ్గురే కాకుండా దసున్ షనక, ఒల్లీ పోప్, ఫజల్‌హాక్ ఫరూఖీ తదితర ప్లేయర్లు ఈ టోర్నీల్లో ఆడడానికి సంతకాలు చేశారు.
ఎమిరేట్స్ క్రికెట్ జనరల్ సెక్రటరీ ముబాష్షీర్ ఉస్మానీ మాట్లాడుతూ.. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే ఆటగాళ్ల జాబితాలో టీ20 ఫార్మాట్లోనే యోధులు అని పేర్కొనదగ్గ వారు సంతకాలు చేయడం వల్ల ఈ లీగ్ ప్రతిష్ఠ మరింత పెరగనుందన్నాడు. మార్క్యూ ప్లేయర్లు లిస్ట్‌లో మరింత మంది స్టార్ ప్లేయర్లతో పాటు యువ ప్రతిభావంతులు కూడా చేరాలని సదా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
ILT20 లీగ్ దుబాయ్, షార్జా మరియు అబుదాబి వేదికలుగా జరగనుంది. మొత్తంగా 34మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ లీగ్‌కు ఇప్పటికే ఐసీసీ నుంచి ఆమోదం లభించింది. ఫ్రాంచైజీ యజమానులలో ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్‌కతా నైట్ రైడర్స్, కాప్రీ గ్లోబల్, GMR, లాన్సర్ క్యాపిటల్, అదానీ స్పోర్ట్స్‌లైన్ ఉన్నాయి.

Story first published: Thursday, August 11, 2022, 23:16 [IST]
Other articles published on Aug 11, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+