Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత జెండాకు అఫ్రిది గౌరవం: ఫిదా అయిన అభిమానులు (వీడియో)

 Afridi

హైదరాబాద్: రాజకీయ పరిస్థితులు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో తనకున్న సంబంధాన్ని నియంత్రించలేవని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పేర్కొన్నాడు. స్విట్జర్లాండ్లోని సెయింట్ మోర్టిజ్ ఐస్ క్రికెట్ సందర్భంగా అఫ్రిది పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో పై వ్యాఖ్యలు చేశాడు.

'రాజకీయ పరిస్థితులు కోహ్లీతో ve సంబంధాన్ని నియంత్రించలేవు. కోహ్లీ మంచి మనసు కలిగిన వ్యక్తి. నా దేశానికి నేను ఎలాగైతే క్రికెట్ అంబాసిడర్‌గా ఉన్నానో కోహ్లీ కూడా తన దేశానికి అలా. కోహ్లీకి నా పట్ల ఎప్పుడూ గౌరవం కలిగి ఉన్నాడు. అందుకే తన సంతకంతో కూడిన జెర్సీని అఫ్రిది ఫౌండేషన్‌కు ఇచ్చాడు' అని పేర్కొన్నాడు.

పాకిస్థాన్‌లో బాగా వెనుకబడిన ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు తాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు గాను అఫ్రిది ఫౌండేషన్ సేవలు అందిస్తోన్న సంగతి తెలిసిందే. 'కోహ్లీతో మాట్లాడటాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదిస్తా. అయితే ఎక్కువ సేపు మేమిద్దరం మాట్లాడుకున్నది లేదు. కానీ ఎప్పుడైనా మేసేజ్‌ పెడితే తాను కూడా స్పందిస్తాడు. ఇటీవలే కోహ్లీ పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అతనికి నా శుభాకాంక్షలు' అని చెప్పాడు.

సెయింట్‌ మోరిట్జ్‌ ఐస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ సందర్భంగా అఫ్రిది భారతీయుల మనసు గెలిచాడు. టోర్నీలో భాగంగా వెటరన్ క్రికెటర్లంతా రెండు జట్లుగా విడిపోయి రెండు మ్యాచ్‌లు ఆడిన సంగతి తెలిసిందే. షాహిద్‌ ఆఫ్రిది నేతృత్వంలో రాయల్స్‌, వీరేంద్ర సెహ్వగ్‌ సారథ్యంలో డైమండ్స్‌ మధ్య పోరు క్రికెట్‌ అభిమానులను ఎంతగానో అలరించింది.

ఈ రెండు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ అనంతరం ఆఫ్రిదితో ఫ్యాన్స్‌ ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో కొందరు తమ తమ దేశ పతాకాలను చేతబట్టి ఫోటోలు దిగుతున్నారు. అదే సమయానికి ఓ ఫొటో దిగాలని అఫ్రిదిని భారతీయ ఫ్యాన్‌ కోరింది.

అదే సమయంలో వారి చేతిలో భారత జాతీయ పతాకం ఉంది. జెండాతో ఫోటో దిగడేమోనని సంశయించిన అభిమానులు దానిని పక్కకు పెట్టారు. అయితే ఆఫ్రిదినే స్వయంగా చొరవ తీసుకొని జాతీయ పతాకాన్ని కూడా సరిగా పట్టుకోవాలని ఆమెను కోరారు. దీంతో వారు పట్టలేనంత సంతోషానికి గురయ్యారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఆఫ్రిది నేతృత్వంలోని రాయల్స్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సిరిస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలవగా, రెండో మ్యాచ్‌లో సెహ్వగ్‌ జట్టుపై 8వికెట్ల తేడాతో గెలిచింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, February 10, 2018, 19:45 [IST]
Other articles published on Feb 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+