For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు.. టార్గెట్ రోహిత్ శర్మ‌ కూడా!!

Police Case on Yuvraj Singh for Casteist Slur Against Yuzvendra Chahal

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌కు సరికొత్త తలనొప్పి ఎదురైంది. టీమిండియా స్టార్ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ను సరదాగా కామెంట్‌ చేసే క్రమంలో కులం పేరు వాడటంతో.. అది కాస్తా తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇప్పుడు ఏకంగా పోలీసు కేసు పెట్టే పరిస్థితి తెచ్చింది. తాజాగా యువరాజ్ సింగ్‌పై దళిత హక్కుల సంఘం నేత రజత్ కల్సన్ పోలీసులు కేసు పెట్టారు.

కులాన్ని కించపరిచావంటూ నెటిజన్లు ఫైర్‌

కులాన్ని కించపరిచావంటూ నెటిజన్లు ఫైర్‌

ఇటీవల టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ‌తో కలిసి నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో యువరాజ్ సింగ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. నిజానికి ఈ వీడియో పాతదే అయినా.. ఇప్పుడు వైరల్‌గా మారింది. టిక్‌టాక్‌లో చహల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడని, వీళ్లకేం పనిలేదంటూ (బాంగీ మనషుల్లా యూజీకి పనిపాట లేనట్లుంది) కించపరిచేలా యువీ వ్యాఖ్య చేశాడు. దీంతో నెటిజన్లు మండిపడ్డారు. ఒక కులాన్ని ఉద్దేశిస్తూ కామెంట్‌ చేస్తావా అంటూ యువీపై విమర్శలు గుప్పించారు. యువరాజ్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు.

యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు

యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు

అయితే హరియాణాలోని హిసార్‌ ప్రాంతంలో తాజాగా యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు పెట్టారు. ఈ కేసులో రోహిత్ శర్మ‌ని కూడా టార్గెట్ చేశారు. యువరాజ్ వ్యాఖ్యలను రోహిత్ ఎందుకు అడ్డుకోలేదని దళిత హక్కుల సంఘం నేత రజత్ కల్సన్ ప్రశ్నించారు. యువరాజ్ అన్న మాట విన్న రోహిత్ నవ్వి ఎలా ఊరుకుంటాడన్నారు. యువరాజ్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. యువీ మాటలకు సంబంధించిన సీడీలు, పత్రాలు పోలీసులకు అందజేశామని తెలిపారు.

చర్యలు తీసుకుంటాం

చర్యలు తీసుకుంటాం

దీనిపై ఢిల్లీ ఎస్పీ లోకేంద్ర సింగ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ... విచారణకు సంబంధించిన వివరాలను ఇప్పటికే డీజీపీకి అందించాం. యువరాజ్ తప్పు చేసినట్లు నిర్ధారణ జరిగితే.. అతనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం' అని హామీ ఇచ్చారు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు టీమిండియా గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రెండు మెగా టోర్నీల్లోను 'టోర్నీ ఆఫ్‌ ది సిరీస్'‌గా నిలిచాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యూవీ ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు కొట్టి సంచలనం సృష్టించాడు.

304 వన్డేలు.. 8701 పరుగులు

304 వన్డేలు.. 8701 పరుగులు

యువరాజ్ 2011 ప్రపంచకప్ అనంతరం క్యాన్సర్‌ బారిన పడి అమెరికా వెళ్లి చికిత్స చేసుకున్నాడు. చికిత్స అనంతరం యువీ కెరీర్‌ అంతగా సాగలేదు. యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎదురు కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో.. టోర్నీ జరుగుతున్న సమయంలోనే యువీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. యువీ మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1,900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8,701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1,177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

Story first published: Thursday, June 4, 2020, 16:44 [IST]
Other articles published on Jun 4, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+