నేటి భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఆసక్తికరం: మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మనసులో మాట (మన్ కీ బాత్) కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న ఆఖరి (ఐదో)వన్డే ఆసక్తికరమని చెప్పారు.
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు రెండు మ్యాచ్‌ల చొప్పున గెలిచాయని, ఈ నేపథ్యంలో ఆదివారం నాటి (ఆఖరు) మ్యాచ్ ఎవరో గెలుస్తారో.. ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా మోడీ ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక అవయవాల దానంపై కొన్ని రాష్ర్టాలు ఆసక్తి చూపుతున్నాయని మోడీ అన్నారు. మహారాష్ట్రలో 80 ఏళ్ల వసంతరావు సురుకే గురూజీ అవయవదానం ఉద్యమాన్ని ఓ పండుగలా నిర్వహిస్తున్నారని అన్నారు.
అవయవాల దానంలో తమిళనాడు బాగా కృషి చేస్తుందని మోడీ అభినందించారు. 2016 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన గ్రూప్ డి, సీ, బీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications