మోడీ అభినందనలు, సానియా కృతజ్ఞతలు (ఫోటోలు)
న్యూఢిల్లీ: సింగపూర్‌లో జరిగిన డబ్ల్యూటీఏ మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్న టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ఆమెకు అభినందనలు తెలిపారు.
"డబ్ల్యూటీఏ ఫైనల్స్ లో విజయం సాధించినందుకు సానియా మీర్జాకు అభినందనలు. మరో గెలుపు దక్కించుకున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది" అని ప్రధానమంత్రి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
అందుకు వెంటనే సానియా మిర్జా కూడా ట్విట్టర్‌లో స్పందించి ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపింది. 'మీ శుభాకాంక్షలకు చాలా గర్వపడుతున్నా'నని పేర్కొంది.
సింగపూర్‌లో ఆదివారం జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో భారత్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా జోడీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్స్‌లో రెండో సీడ్ సువిసై (చైనీస్ తైపీ), షువయ్ పెంగ్ (చైనా)పై సానియా మిర్జా, కారా బ్లాక్ జోడీ 6-1, 6-0 తేడాతో గెలుపొందింది.

మోడీ అభినందనలు, సానియా కృతజ్ఞతలు
సింగపూర్‌లో ఆదివారం జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో భారత్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా జోడీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్స్‌లో రెండో సీడ్ సువిసై (చైనీస్ తైపీ), షువయ్ పెంగ్ (చైనా)పై సానియా మిర్జా, కారా బ్లాక్ జోడీ 6-1, 6-0 తేడాతో గెలుపొందింది.

మోడీ అభినందనలు, సానియా కృతజ్ఞతలు
ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ప్రత్యర్థి పాలు కాకుండా సంపూర్ణాధిపత్యం ప్రదర్శించింది. కేవలం 59 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఈ టోర్నీ ఫైనల్ చరిత్రలో ఇంత భారీ తేడాతో ప్రత్యర్థిని ఓడించడం ఇదే ప్రథమం.

మోడీ అభినందనలు, సానియా కృతజ్ఞతలు
కాగా, సానియా, కారాకు జోడీగా ఇదే చివరి టోర్నీ. 2013 చివర్లో జత కట్టిన ఈ జోడీ.. టోక్యో, బీజింగ్ ఓపెన్‌లను ఖాతాలో వేసుకోగా, ఇప్పుడీ ప్రతిష్టాత్మక టైటిల్‌తో తమ ప్రయాణానికి ఘనంగా వీడ్కోలు పలికింది.

మోడీ అభినందనలు, సానియా కృతజ్ఞతలు
ఈ సందర్భంగా సానియా మిర్జా మాట్లాడుతూ డబ్ల్యూటీఏ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ తొలిసారే విజేతగా నిలిచినందుకు సంతోషంగా ఉంది. టోర్నీలో తొలిమ్యాచ్ నెగ్గినప్పుడే టైటిల్ మాదేనని అనుకున్నాం. కార్లాతో కలిసి నేనాడిన మ్యాచుల్లో ఇదే అత్యుత్తమ నుకుంటా. కారాలో గొప్ప స్నేహశీలిని చూశాను. తను నాకు అక్కలాంటిది. ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నాను అని చెప్పింది.
వీరిద్దరూ కలిసి ఆడిన తొలి రెండు టోర్నీ(టోక్యో, బీజింగ్)ల్లో టైటిల్ విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా సానియా మిర్జా మాట్లాడుతూ డబ్ల్యూటీఏ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ తొలిసారే విజేతగా నిలిచినందుకు సంతోషంగా ఉంది. టోర్నీలో తొలిమ్యాచ్ నెగ్గినప్పుడే టైటిల్ మాదేనని అనుకున్నాం. కార్లాతో కలిసి నేనాడిన మ్యాచుల్లో ఇదే అత్యుత్తమ నుకుంటా. కారాలో గొప్ప స్నేహశీలిని చూశాను. తను నాకు అక్కలాంటిది. ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నాను అని చెప్పింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications