న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో రజత పతకం సాధించి, ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.

'ఇండోనేషియాలో జరిగిన ప్రఖ్యాత ప్రపంచ బ్యాడ్మింటన్ షిప్‌లో పాల్గొని అద్భుత ప్రదర్శన చేసిన సైనాకు అభినందనలు. తన విజయం ఎందరికో స్ఫూర్తినిస్తుంది' అని ప్రధానమంత్రి కార్యాలయ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
వారికే అంకితం, థ్యాంక్స్: సైనా
సైనా రజత పతకాన్ని తన కోచ్ విమల్, తల్లిదండ్రులు, ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్‌కు అంకితమిచ్చారు. వారిచ్చిన ప్రోత్సాహానికి ఆమె ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఓడినప్పటికీ ర్యాంకింగ్స్‌లో సైనానే అగ్రస్థానంలో కొనసాగుతోంది.