Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భజ్జీ రిసెప్షన్లో మోడీ హల్‌చల్, యువీ-కోహ్లీ సందడి

ఢిల్లీ/హైదరాబాద్: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్‌ పెళ్లి విందులో రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు సందడి చేశారు. గురువారం పంజాబ్‌లోని జలంధర్‌లో బాలీవుడ్‌ నటి గీత బస్రాను భజ్జీ వివాహం జరిగింది. ప్రముఖులు, సన్నిహితుల కోసం ఆదివారం దిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ హోటల్లో భజ్జీ విందు ఏర్పాటు చేశాడు.

ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్త దంపతులను దీవించారు. భారత క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, అజింక్యా రహానె కుటుంబ సమేతంగా వేడుకకు హాజరయ్యారు. విందులో యువరాజ్ సింగ్‌తో కలిసి కోహ్లీ సందడి చేశాడు.

భారత క్రికెట్ సహచరులు విరాట్‌ కోహ్లి, యువరాజ్ సింగ్‌, మురళీ విజయ్‌, ఛటేశ్వర పుజారా, రవిచంద్రన్ అశ్విన్, మాజీలు కపిల్ దేవ్‌, అనిల్‌ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్‌, జట్టు డైరెక్టర్‌ రవి శాస్త్రి, ఐపీఎల్‌ కమిషనర్‌ రాజీవ్‌ శుక్లా, బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్ ఖాన్‌, ప్రియాంక చోప్రా తదితరులు హాజరయ్యారు.

ప్రధాని మోడీ కొత్త జంటతో కాసేపు ముచ్చటించారు. అంతేకాదు, వేడుకకు హాజరైన అతిథులనూ పలకరించారు. ఈ వేడుకకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ డీజీపీగా పనిచేసి ఉగ్రవాదం అణచివేతలో పేరుగాంచిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కేపీఎస్ గిల్ హాజరయ్యారు.

మోడీ

మోడీ

భారత క్రికెటర్ హర్భజన్ సింగ్, మోడల్ గీతా బస్రాల వివాహం మూడు రోజుల క్రితం జరిగింది. ఢిల్లీలో భజ్జీ విందు ఇచ్చారు. విందుకు ప్రధాని మోడీ హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు.

భజ్జీ రిసెప్షన్

భజ్జీ రిసెప్షన్

భారత క్రికెటర్ హర్భజన్ సింగ్, మోడల్ గీతా బస్రాల వివాహం మూడు రోజుల క్రితం జరిగింది. ఢిల్లీలో భజ్జీ విందు ఇచ్చారు. విందుకు హాజరైన పుజారా, విజయ్, ఆరోన్.

భజ్జీ రిసెప్షన్‌లో రహానే దంపతులు

భజ్జీ రిసెప్షన్‌లో రహానే దంపతులు

భారత క్రికెటర్ హర్భజన్ సింగ్, మోడల్ గీతా బస్రాల వివాహం మూడు రోజుల క్రితం జరిగింది. ఢిల్లీలో భజ్జీ విందు ఇచ్చారు. విందుకు హాజరైన అజింక్యా రహానే, భార్య.

భజ్జీ రిసెప్షన్‌లో కపిల్ దేవ్

భజ్జీ రిసెప్షన్‌లో కపిల్ దేవ్

భారత క్రికెటర్ హర్భజన్ సింగ్, మోడల్ గీతా బస్రాల వివాహం మూడు రోజుల క్రితం జరిగింది. ఢిల్లీలో భజ్జీ విందు ఇచ్చారు. విందుకు హాజరైన కపిల్ దేవ్, ఆయన సతీమణి.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+