Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పీటర్సన్‌ హిందీ ట్వీట్‌.. స్పందించిన భారత ప్రధాని.. ఆసక్తికర సంభాషణ!!

PM Modi responds to Kevin Pietersens tweet, joins forces with to fight against COVID-19

ఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) రోజురోజుకు తన పంజా విసురుతున్న విషయం తెలిసిందే. భారత దేశంలో ఇప్పటికే 258 మందికి కరోనా సోకగా.. నలుగురు మృత్యువాత పడ్డారు. భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను నివారించడానికి ప్రధాని నరేంద్ర మోదీ 'జనతా కర్ఫ్యూ'ను తలపెట్టిన విషయం తెలిసిందే. వైరస్‌ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాల సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు.

స్వచ్ఛంద నిర్బంధం :

స్వచ్ఛంద నిర్బంధం :

'జనతా కర్ఫ్యూ'లో భాగంగా సినీ, క్రీడా ప్రముఖులతో పాటు అన్ని వర్గాల వారు ఆదివారం స్వచ్ఛంద నిర్బంధం పాటించాలని భావిస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లు తాము ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడంతో పాటు తమ అభిమానులు కూడా జనతా కర్ఫ్యూలో పాలుపంచుకోవాలని ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ కూడా శుక్రవారం గళం కలిపాడు. భారత ప్రజలు కరోనాను అడ్డుకోవడానికి ప్రభుత్వం సూచించిన విషయాలను తప్పక పాటించాలని హిందీలో ట్వీట్‌ చేశాడు.

పీటర్సన్‌.. మనకోసం స్పందించాడు:

పీటర్సన్‌.. మనకోసం స్పందించాడు:

'నమస్తే ఇండియా. అంతా ఒక్కటై కరోనాపై పోరాటం చేద్దాం. ఇంట్లో ఉండి స్వీయ నిర్భందం పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును పాటిద్దాం' అని పీటర్సన్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో నెటిజెన్లు పీటర్సన్‌కు ఫిదా అయ్యారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కూడా అతడి ట్వీట్‌కు స్పందించి మెచ్చుకున్నారు. 'క్రికెట్ ఆటలో ఎన్నో ఒడిదుడికులు ఎదుర్కొని ఎన్నో జట్లను చూసిన విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ పీటర్సన్‌.. మనకోసం స్పందించాడు. మనమంతా కరోనాపై పోరాటం​ చేద్దాం' అని మోదీ రిప్లై ఇచ్చారు.

మోదీ జీ.. మీ నాయకత్వం అచ్చం అలాగే:

ప్రధాని మోదీ ట్వీట్‌కు పీటర్సన్‌ బదులిచ్చాడు. 'ధన్యవాదాలు మోదీజీ.. మీ నాయకత్వం కూడా అలాగే (విధ్వంసకరంగా) ఉంది' అని హిందీలో ట్వీట్‌ చేశాడు. తొలుత ట్వీట్‌ చేసిన పీటర్సన్‌ హిందీలోనే పోస్ట్‌ చేయగా.. ఆ తర్వాత కూడా హిందీలోనే రిప్లే ఇవ్వడం విశేషం. ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మన్‌ అయిన పీటర్సన్‌కు మోదీ ఇంగ్లిష్‌లో ట్వీట్‌ చేస్తే.. పీటర్సన్‌ మాత్రం హిందీలోనే సమాధానం ఇవ్వడం ఆసక్తిగా మారింది.

యువీ పంచ్:

యువీ పంచ్:

పీటర్సన్‌ మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫొటో పోస్టు చేసాడు. ఆ ఫొటోలో కుడి భుజంపై అందమైన పక్షి వాలిపోయి ఉంది. ఎడమవైపు ఓ చిరుతపులి, శునకం ఉన్నాయి. తాను జంతు ప్రేమికుడనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ పెట్టాడు. ఇది చూసిన భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌.. పీటర్సన్‌ను ట్రోల్ చేశాడు. 'నైస్‌ ఫొటోషాప్‌ బ్రో' అంటూ కామెంట్‌ చేశాడు. పీటర్సన్‌ కామెంట్లలోనే అది ఫొటోషాప్‌లో చేసిందేనని ఒప్పుకున్నాడు. వీరిద్దరూ గతంలోనూ ఎన్నోసార్లు సామాజిక మాధ్యమాల్లో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.

Story first published: Saturday, March 21, 2020, 16:11 [IST]
Other articles published on Mar 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+