Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్‌తో ప్రధాని మోడీని కలిసిన అంధుల క్రికెట్ జట్టు

హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన అంధుల క్రికెట్ జట్టు సభ్యులు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వారిని అభినందించారు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో మరిన్ని సాధించాలని వారికి సూచించారు.

జట్టు సభ్యుల ఆటోగ్రాఫ్‌లతో కూడిన బ్యాట్, బంతితో పాటు మోడీ పేరు గల జెర్సీని అందజేశారు. మరోవైపు మోడీ కూడా తన సంతకం గల బ్యాట్, బంతిని జట్టు సభ్యులకు కానుకగా ఇచ్చారు. బెంగుళూరులో జనవరి 28న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 PM Modi meets India's national cricket team for blind, congratulates on T20 WC win

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పైనల్స్‌లో దాయాది దేశమైన పాకిస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. తద్వారా రెండోసారి టైటిల్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. 2012 టోర్నీలోనూ భారత ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి మొట్టమొదటిసారి వరల్డ్‌కప్‌ను సాధించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 197 పరుగుల చేసింది. అనంతరం 198 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 17.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకుంది.

అంధుల టీ20 వరల్డ్ కప్‌లో రెండోసారి ఛాంపియన్‌గా అవతరించిన భారత్‌ను ప్రధాన నరేంద్ర మోడీతో పలువురు అభినందనలు తెలిపారు. టీమిండియా అద్భుత ప్రదర్శనకు దేశ ప్రజలు గర్విస్తున్నారని, భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నానని ప్రధాని తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+