Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల బృందానికి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారత అథ్లెట్లు పతకాలతో పాటు అందరి హృదయాలు కూడా గెలుచుకోవాలని ఆయన కాంక్షించారు. ఆదివారం రన్ ఫర్ రియో కార్యక్రమాన్ని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ మైదానంలో జెండా ఊపి ప్రధాని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని, వారికి శుభాకాంక్షలు తెలపాలని ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు. క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని భాగస్వామ్యమే కీలకమన్నారు.

రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసేలా నిలువెత్తు స్ఫూర్తిగా నిలువాలని ఆయన ఆకాంక్షించారు. కఠిన శిక్షణతో అంతకు మించిన కఠోరశ్రమతో క్రీడాకారులు ఒలింపిక్స్‌కు అర్హత సాధించారని అన్నారు. ప్రతి ఒక్కరు పతకంతో తిరిగి రావాలని 125 కోట్ల మంది ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు.

 రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న 119 మంది భారత క్రీడాకారులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులు పతకాలతో పాటు ప్రపంచ ప్రజల మనసులను గెలవాలి అని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.

 రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌కు తరలి వస్తారని, భారత క్రీడాకారుల విజయం కోసం 125 కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఆగస్టు 15న దేశంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని, రియో ఒలింపిక్స్‌లో ప్రతిరోజు భారత పతాకం రెపరెపలాడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

 రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

రాబోయే ఒలింపిక్స్‌లో దేశంలోని ప్రతి జిల్లానుంచి ఒక అథ్లెట్ అర్హత సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. అందుకు తగిన విధమైన మెరుగైన ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు.

రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

అధికారం చేపట్టి రెండేండ్లు మాత్రమే పూర్తి చేసుకోవడంతో క్రీడలకు తగినంత ప్రాధాన్యాన్ని ప్రభుత్వం కల్పించలేకపోవడంతో తక్కువమంది క్రీడాకారులు ఒలింపిక్స్‌కు అర్హత సాధించారన్నారు. మరింత మంది క్రీడాకారులను తయారు చేయడంలో తగినంత సమయం లేకపోయిందని తెలిపారు.

రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

2020లో జపాన్ దేశంలోని టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌లో 200 మందికి పైగా క్రీడాకారులు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ఈ అవకాశాన్ని దేశంలోని యువత సద్వినియోగం చేసుకోవాలి.

రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

ప్రతి జిల్లానుంచి ఒక క్రీడాకారుడు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలి అని మోడీ అన్నారు. ఇందుకు సంబంధించిన మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతోపాటు క్రీడా సౌకర్యాలను మెరుగు పరిచేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందన్నారు.

 రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు అందే భత్యం కంటే వారి వెంట వెళ్లే అధికారులు బృందానికి ఎక్కువ భత్యం చెల్లించడం జరిగిందని విమర్శించారు. ఇప్పుడు మాత్రం అధికారులతో సమానంగా క్రీడాకారులకూ భత్యాన్ని చెల్లిస్తున్నామని అన్నారు.

 రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

రన్ ఫర్ రియో: ప్రతి ఒక్కరూ పతకం గెలవాలన్న మోడీ

ఎంతో కఠోరంగా శ్రమించి దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటే క్రీడాకారులకు సరైన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. నెహ్రూ స్టేడియం వరకు కొనసాగిన ఈ పరుగులో దాదాపు 20 వే ల మంది విద్యార్థులు రియో పరుగులో పాల్గొన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+