For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ రికార్డ్ విజయం: కీపిటప్ అంటూ ధోనీ సేనకు మోడీ

By Srinivas

న్యూఢిల్లీ: ప్రపంచ కప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో జట్టు అద్భుతంగా రాణిస్తుందని ట్వీట్ చేశారు. వరుసగా విజయాలు సాధిస్తున్న జట్టు ఇదే రీతోలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జట్టుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఐసీసీ వరల్డ్ కప్‌లో పూల్ బిలో భాగంగా భారత్, ఐర్లాండ్‌ మధ్య హామిల్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 8వికెట్ల తేడాతో భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే. 36.5 ఓవర్లలో 260 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా చేధించింది. వరల్డ్ కప్‌లో భారత్‌కు ఇది ఐదవ విజయం. ఈ విజయంతో వరల్డ్ కప్‌లో ధోనిసేన వరుసగా తొమ్మిదవ విజయాన్ని నమోదు చేసింది.

 PM Modi congratulates Indian cricket team for beating Ireland in WC encounter

ధోనీకి ఈ మంగళవారం రికార్డుల రోజు. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా మంగళవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో భారత్ గెలవడంతో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును కెప్టెన్ ధోనీ బద్దలుకొట్టినట్లయింది. ప్రపంచ కప్ టోర్నీలో భారత్ తన విజయాల రేటును పెంచుకుంది.

ఇది టీమిండియాకు వరుసగా ఐదో విజయం. ప్రపంచ కప్ టోర్నీ చరిత్రలో వెస్టిండీస్ పేరిట ఉన్న రికార్డును టీమిండియా సమం చేసింది. మంగళవారం మ్యాచులో విజయం ప్రపంచ కప్ టోర్నీలో భారత్ పేరిట విజయాలను పెంచేసింది. ప్రపంచ కప్ టోర్నీలో వరుసగా 9 విజయాలను నమోదు చేసిన టీమిండియా.. 1975, 1979లలో వరుసగా వరుస 9 విజయాలను సాధించిన వెస్టిండీస్(ఈ రెండుసార్లు కప్ విండీస్‌దే) రికార్డును సమం చేసింది.

2003 ప్రపంచ కప్ టోర్నీలో గంగూలీ నాయకత్వంలోని టీమిండియా వరుసగా 8 విజయాలు నమోదు చేసింది. ప్రపంచ కప్ టోర్నీల్లో శిఖర్ ధావన్-రోహిత్ శర్మల భాగస్వామ్యం మరో రికార్డును నమోదు చేసింది. 1996లో సచిన్ టెండూల్కర్-అజయ్ జడేజాలు చేసిన 163 పరుగుల భాగస్వామ్యాన్ని 174 పరుగులు చేసిన రోహిత్-శిఖర్ బ్రేక్ చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+