Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: వాన్, కుక్‌.. బ్రాడ్‌ (8/15) ప్రదర్శనపై ఎందుకు మాట్లాడడం లేదు: ఓజా

Please talk about Stuart Broads 8 for 15: Pragyan Ojha slams Michael Vaughan and Alastair Cook

హైదరాబాద్: రెండు రోజుల్లోనే ముగిసిన మొతేరా టెస్టు పిచ్‌పై విమర్శలు గుప్పిస్తున్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైకేల్‌ వాన్, అలిస్టర్‌ కుక్‌.. పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ 15 పరుగులకే 8 వికెట్లు తీసిన పిచ్‌ గురించి కూడా మాట్లాడాలని భారత మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా అన్నాడు. మొతేరా పిచ్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఓజా మండిపడ్డాడు. గుజ‌రాత్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో జ‌రిగిన డేనైట్ టెస్ట్ మ్యాచ్ కేవ‌లం రెండు రోజుల్లోపే ముగిసిన విష‌యం తెలిసిందే. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ (11), రవిచంద్రన్ అశ్విన్ (7) చెలరేగడంతో 10 వికెట్ల తేడాతో భారత్ ఘ‌న విజ‌యం సాధించింది.

టెస్టు మ్యాచ్‌ అంటేనే:

టెస్టు మ్యాచ్‌ అంటేనే:

తాజాగా ప్రజ్ఞాన్‌ ఓజా మాట్లాడుతూ... 'టెస్టు మ్యాచ్‌ అంటేనే ఎలాంటి పిచ్‌పైనైనా ఆడడం. అది పేస్‌ వికెట్‌ కావొచ్చు లేదా స్పిన్‌ పిచ్‌ కావొచ్చు. పిచ్ ఏదైనా బ్యాటింగ్ చేయాలి, బౌలింగ్ వేయాలి. ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టులో భారత బౌలర్లు గొప్పగా బంతులేశారు. వారు వేసిన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను గమనిస్తే.. ప్రతి బంతీ వికెట్‌కు తగిలేలా కనిపించింది. స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ అద్భుతం' అని అన్నాడు. మ్యాచులో 30 వికెట్లు పడితే 28 స్పిన్నర్లు తీసినవే ఉన్నాయి.

బ్రాడ్‌ ప్రదర్శనపై మాట్లాడండి:

బ్రాడ్‌ ప్రదర్శనపై మాట్లాడండి:

'మొతేరా పిచ్‌ గురించి ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు మాట్లాడుతున్నారు. కానీ వాళ్లు పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ (8/15) ప్రదర్శనపై కూడా మాట్లాడితే బాగుంటుంది. అతను వికెట్లు తీసిన పిచ్‌ ఎలాంటిది? పచ్చికతో కళకళలాడే పిచ్‌పై టెస్టు 2-3 రోజుల్లో పూర్తయితే ఫర్వాలేదా?. అదే బంతి బాగా స్పిన్, బౌన్స్‌ అయితే ఇది ఐదు రోజుల పిచ్‌ కాదని విమర్శిస్తున్నారు' అని ప్రజ్ఞాన్‌ ఓజా మండిపడ్డాడు. వాన్, కుక్‌ ఇద్దరూ మొతేరా పిచ్‌పై విమర్శలు చేస్తుంటే.. పీటర్సన్ మాత్రం సానుకూలంగా స్పందించాడు.

ఇంగ్లండ్ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి:

ఇంగ్లండ్ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి:

డేనైట్ టెస్టు పిచ్‌పై ఇంగ్లండ్ కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకోవడం మంచిదికాదని కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. సిల్వర్‌వుడ్‌ అహ్మదాబాద్ పిచ్‌ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఫిర్యాదు చేయాలనుకోవడం ముందే ఓటమిని అంగీకరించినట్లు అవుతుందన్నాడు. అన్ని పక్కనపెట్టి చివరి టెస్టు కోసం బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలని కేపీ సూచించాడు. ఎవరినైనా వేలెత్తి చూపితే, మిగిలిన నాలుగేళ్లు మనవైపే చూపుతాయని.. ఇంగ్లండ్ ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేపీ పేర్కొన్నాడు.

ప్రాక్టీస్‌ షురూ:

ప్రాక్టీస్‌ షురూ:

గురువారం నుంచి ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై దుమ్మురేపుతున్న భారత్ చివరి టెస్టు కోసం సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నది. మొతెరాలో జరిగిన తొలి అంతర్జాతీయ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో.. అదనంగా మరో మూడు రోజులు కలిసిరావడంతో భారత ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. సోమవారం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే, స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. మరోవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా సాధన మొదలెట్టారు.

Story first published: Tuesday, March 2, 2021, 10:11 [IST]
Other articles published on Mar 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+