Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashwin vs Manjrekar:అలా అన‌కు చారీ! సినిమా డైలాగ్‌తో.. మంజ్రేక‌ర్‌కు పంచ్‌ ఇచ్చిన అశ్విన్!!

Please dont say such things Chaari: Ravichandran Ashwin punch to Sanjay Manjrekar

లండన్: భారత మాజీ క్రికెట‌ర్, వివాస్పద కామెంటేటర్ సంజ‌య్ మంజ్రేక‌ర్‌ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ అందరి ఆగ్రహానికి గురవవుతుంటాడు. 2019 ప్రపంచకప్ సమయంలో హర్ష భోగ్లే, రవీంద్ర జడేజాపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. వ్యాఖ్యానంకు కూడా దూరమయ్యాడు. అయినా తన పంతా మార్చుకోవడంలేదు. తాజాగా ఇండియ‌న్ వెటరన్ ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను టార్గెట్ చేశాడు. అశ్విన్ మంచి స్పిన్న‌రే కావ‌చ్చు కానీ.. ఆల్‌టైమ్ గ్రేట్‌లో ఒక‌డు మాత్రం కాద‌ని మంజ్రేక‌ర్ అభిప్రాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఇది విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది.

అశ్విన్‌ అత్యుత్తమ బౌలర్ కాదు:

అశ్విన్‌ అత్యుత్తమ బౌలర్ కాదు:

ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో ఇంటర్వ్యూలో సంజయ్ మంజ్రేకర్‌ మాట్లాడుతూ... 'ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బౌలర్లలో ఒకడిగా నేను పరిగణించలేను. ఎందుకంటే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో అతడు ఒక్కసారి కూడా 5 వికెట్ల ఘనత సాధించలేదు. సొంతగడ్డపై తనకు అనుకూలమైన పిచ్‌లపై మాత్రం చెలరేగిపోతాడు. ఇక్కడ కూడా గత నాలుగేళ్లుగా వికెట్ల వేటలో రవీంద్ర జడేజా అతడితో పోటీపడుతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో స్పిన్‌ పిచ్‌లపై అక్షర్‌ పటేల్‌ అతడికన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌ను నిజమైన ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా పరిగణించడంలో ఇవే నా సమస్యలు' అని అన్నాడు.

మాజీల ఆగ్రహం:

రవిచంద్రన్ అశ్విన్‌ను తక్కువ చేస్తూ వ్యాఖ్యలు చేసిన సంజయ్ మంజ్రేకర్‌పై సోషల్ మీడియా వేదికగా మాజీలు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మంజ్రేకర్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ ఛాపెల్‌ మండిపడ్డాడు. జోయల్‌ గార్నర్‌ గురించి చెపుతూ.. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌ ఆడుతున్న అత్యుత్తమ బౌలర్లలో అశ్విన్‌ ఒకడని వివరణ ఇచ్చాడు. తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ సల్మాన్ బట్ స్పందించారు. టాప్ టీమ్స్‌పై అశ్విన్ ప్రదర్శనను ఓవరాల్‌గా చూడాలని మంజ్రేకర్‌ను ముకుంద్ కోరాడు. యాష్, లయన్ గొప్ప లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేస్తారని, కానీ వేరియషన్స్ విషయంలో అశ్విన్‌దే పైచేయని బట్ పేర్కొన్నాడు.

అలా అన‌కు చారీ:

అలా అన‌కు చారీ:

తన కథనం పట్ల వస్తున్న విమర్శల నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. ట్విటర్ వేదికగా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు. తన దృష్టిలో ఆల్‌టైమ్ గ్రేట్ అంటే.. క్రికెటర్‌కు ఇచ్చే అత్యున్నత ప్రశంస, గుర్తింపని తెలిపాడు. డాన్ బ్రాడ్ మన్, గ్యారీ సోబెర్స్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తదితరుల్లా అని చెప్పుకొచ్చాడు. ఇంకా ఆ జాబితాలోకి ఆర్ అశ్విన్ రాలేదని పేర్కొన్నాడు. ఇక తాజాగా మంజ్రేక‌ర్ ట్వీట్‌కు అశ్విన్ రిప్లై ఇస్తూ.. త‌మిళ మూవీ అన్నియ‌న్ (అప‌రిచితుడు)లోని ఓ డైలాగ్ మీమ్‌ను పోస్ట్‌ చేశాడు. అప్డి సొల్లాదా చారీ, మ‌న‌సెల్ల‌మ్ వ‌లికిర్దు (అలా అన‌కు చారీ.. నా మ‌న‌సు బాధ‌ప‌డుతుంది) అనే త‌మిళ డైలాగుతో ఉన్న ఫొటోను అశ్విన్ వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు.

 78 టెస్టుల్లో 409 వికెట్లు:

78 టెస్టుల్లో 409 వికెట్లు:

ఇప్ప‌టి వ‌ర‌కూ 78 టెస్టుల్లో 409 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ కెరీర్‌లో మొత్తం 30 సార్లు ఒక ఇన్నింగ్స్‌లో 5 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. అయితే సేన (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో మాత్రం ఒక్క‌సారి కూడా అశ్విన్ ఐదు వికెట్లు తీయ‌లేక‌పోడు. ఇక భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా సమరం కోసం యాష్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

Story first published: Tuesday, June 8, 2021, 10:56 [IST]
Other articles published on Jun 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+