కంగ్రాట్స్ హార్దిక్.. వాటే ప్లెజెంట్ సర్‌ప్రైజ్: కోహ్లీ

ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంగేజ్‌మెంట్ బాలీవుడ్ నటి, సెర్బియాకు చెందిన నటాషా స్టాన్‌కోవిచ్‌తో జరిగింది. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో మంగళవారం స్పీడ్ బోట్‌లో విహరిస్తూ హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ తొడిగాడు. ఆ తర్వాత కేక్ కట్ చేసి కిస్ ఇచ్చాడు. ఆపై తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

నీకు నేను, నాకు నువ్వు:
ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పోస్టు చేసిన పాండ్యా.. 'నీకు నేను, నాకు నువ్వు, హిందుస్తాన్ మొత్తానికి ఇది తెలియాలి' అని క్యాప్షన్ పెట్టాడు. మరోవైపు తనకు హార్దిక్ ప్రేమను వ్యక్తం చేస్తూ ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని తొడిగిన వీడియోను నటాషా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానుంది.

వాటే ప్లెజెంట్ సర్‌ప్రైజ్:
ఎటువంటి సమాచారం లేకుండానే పాండ్యా నిశ్చితార్థం చేసుకోవడంతో క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసారు. హార్దిక్‌కు పలువురు క్రికెటర్లు విషెస్ తెలియజేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 'వాటే సర్‌ప్రైజ్ హార్దిక్' అంటూ ఓ ట్వీట్ చేసాడు. 'కంగ్రాట్స్ హార్దిక్. వాటే ప్లెజెంట్ సర్‌ప్రైజ్. మీ భవిష్యత్తు బాగుండాలి. దేవుడు ఆశీర్వాదాలు మీకు ఎప్పటికి ఉంటాయి' అని కోహ్లీ రాసుకొచ్చాడు.

సహచరుల అభినందనలు:
టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లు అభినందించారు. మరొకవైపు బాలీవుడ్ స్టార్స్ సునీల్ శెట్టి, అతియా శెట్టి, సోనల్ చౌహాన్‌లు కూడా హార్దిక్‌కు విషెస్ తెలిపారు. కేఎల్ రాహుల్ గర్ల్‌ఫ్రెండ్ అతియా శెట్టి అన్న విషయం తెలిసిందే. పాండ్యా ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కివీస్ పర్యటనకు పాండ్యా:
గత సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్ తర్వాత వెన్ను నొప్పితో హార్దిక్ పాండ్యా ఆటకు దూరమయ్యాడు. లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ సిరీస్‌లకు దూరమయ్యాడు. ఇటీవలే మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టిన హార్దిక్.. పునరాగమనం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్న పాండ్యా ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే కివీస్ పర్యటనకు వెళ్లే అవకాశముంది.

బాలీవుడ్‌లో తెరంగేట్రం:
సెర్బియాలో పుట్టిన నటాషా స్టాన్‌కోవిచ్ ముంబైలో స్థిరపడింది. నటాషా 2013లో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసి ప్రత్యేక గీతాల్లో తళుక్కుమంటున్నది. ఇటీవలే హిందీ బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఆమె మంచి క్రేజ్ సంపాదించింది. విరాట్ కొహ్లీ, యువరాజ్, జహీర్ ఖాన్ సహా పలువురు క్రికెటర్లు సినిమా హీరోయిన్లను వివాహమాడారు. ఇప్పుడు ఆ జాబితాలో పాండ్యా చేరారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications