అభిమానులకు భారీ షాక్.. ఐపీఎల్ నిర్వహించవద్దని కోర్టులో పిటిషన్!!


చెన్నై: మార్చి 29న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020పై ఒకింత సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (కోవిడ్-19) సెగ ఐపీఎల్‌కు తాకడమే అందుకు కారణం. కరోనా భారత్‌లో కూడా వేగంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 60పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో.. ఐపీఎల్‌ను నిర్వహించవద్దని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

కోర్టులో పిటిషన్:
మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020 సీజన్‌ను నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వొద్దని కోరుతూ మద్రాసు హైకోర్టులో న్యాయవాది జి అలెక్స్ బెంజిగర్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ఎంఎం సుంద్రేశ్, కృష్ణన్ రామస్వామి డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది.

బీసీసీఐకి అనుమతి ఇవ్వొద్దు:
'ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌లో కొవిడ్-19 మందుని ఇంకా కనుగొన్నట్లు నమోదు కాలేదు' అని పిటిషన్‌లో జి అలెక్స్ పేర్కొన్నారు. 'కరోనా వైరస్ ప్రపంచమంతా అంటు వ్యాధిలా వేగంగా వ్యాపిస్తుంది. కరోనా ప్రభావంతో ప్రతిష్ఠాత్మక లీగ్ అయిన ఇటలీ ఫెడరేషన్ లీగ్‌ను కూడా ఆ దేశ ప్రభుత్వం మైదానంలోకి అభిమానులను అనుమతించకుండా నిర్వహిస్తుంది' అని పిటిషన్‌లో రాసారు. ఐపీఎల్‌ను నిర్వహించడానికి బీసీసీఐకి అనుమతించవద్దని ప్రతిపాదించినా.. అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు అని పేర్కొన్నారు.

ఆర్సీబీకీ షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం:
కరోనా వైరస్ భయంతో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే. లీగ్‌ను వాయిదా వేయాలని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపె బీసీసీఐకి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం తాము ఎట్టి పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను నిర్వహించమని ప్రకటించింది. అంతేకాకుండా ఐపీఎల్ 2020 సీజన్‌ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది.

షెడ్యూల్ ప్రకారమే లీగ్ అంటున్న దాదా:
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్‌ను వాయిదా వేసే అవకాశముందన్న రాజేశ్ తోపే వ్యాఖ్యలకు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ధీటుగా స్పందించాడు. కరోనా వైరస్ ఉన్నా..షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందంటూ సోమవారం మీడియాతో చెప్పాడు. లీగ్‌కు ముందుకు సాగుతున్న సమయంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కావాల్సిన అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని దాదా పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications