Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsKKR : టాప్లే దూరం.. కోహ్లీ, డుప్లెసిస్‌పై బ్యాటింగ్ భారం.. కేకేఆర్‌తో తలపడే జట్టు ఇదే!

కోల్‌కతాతో ఉత్కంఠ పోరుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెడి అయింది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ.. రెండో మ్యాచులో కూడా కచ్చితంగా గెలవాలని గట్టి పట్టుదలగా ఉంది. అదే సమయంలో తమ మొదటి మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో ఓటమి మూటగట్టుకున్న కేకేఆర్.. ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి ఈ సీజన్‌లో తమ ఖాతా తెరవాలని అనుకుంటోంది.

అయితే ఈ రెండు జట్లకు గాయాల బెడద గట్టి షాక్ ఇచ్చింది. శ్రేయాస్ అయ్యర్ గాయంతో ఈ సీజన్‌కు దూరం అవడంతో నితీష్ రాణాకు కేకేఆర్ పగ్గాలు అందించిన సంగతి తెలిసిందే. అతని కెప్టెన్సీలో ఆడిన తొలి మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి పాలైంది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, మన్‌దీప్ సింగ్ ఇద్దరూ అంత గొప్పగా రాణించలేదు. ఈ క్రమంలో వెంకటేశ్ అయ్యర్‌ను ఓపెనర్‌గా పంపే అవకాశం ఉంది.

Playins XI of both teams RCBvsKKR Today IPL match

జేసన్ రాయ్ ఈ మ్యాచ్ జరిగే సమయానికి కేకేఆర్‌తో కలిసే అవకాశం ఉంది. అయితే అతను ఈ మ్యాచ్‌లో ఆడటం అనుమానమే. అలాగే ప్రాక్టీస్‌లో ఇప్పటికీ పూర్తి రనప్‌తో బౌలింగ్ చేయలేకపోతున్న లోకీ ఫెర్గూసన్ కూడా ఆడటం దాదాపు అసాధ్యం. ఇక బెంగళూరుకు కీలకమైన వానిందు హసరంగ, జోష్ హాజిలవ్‌వుడ్ ఇద్దరూ ఏప్రిల్‌లోనే జట్టుతో కలవనున్నారు. కాబట్టి బౌలింగ్ విభాగంలో ఆర్సీబీ పెద్దగా మార్పులు చేయకపోవచ్చు.

అయితే ముంబైతో మ్యాచ్‌లో భుజం గాయానికి గురైన రీస్ టాప్లే.. కోల్‌కతా వచ్చినప్పుడు కూడా ఆ చేతికి కట్టుతోనే ఉన్నాడు. కాబట్టి అతను ఈ మ్యాచ్ ఆడటం కుదరదు. అతని స్థానంలో డేవడ్ విల్లేను ఆర్సీబీ ఆడించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ పై భారం మరింత పెరగనుంది. ముందుగా ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తే.. మహిపాల్ లోమ్రోర్, సూయష్ ప్రభుదేశాయిల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చు.

కోల్‌కతా జట్టు (అంచనా): రహ్మనుల్లా గుర్బాజ్, మన్‌దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి.

బెంగళూరు జట్టు (అంచనా): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాష్ దీప్

Story first published: Thursday, April 6, 2023, 13:00 [IST]
Other articles published on Apr 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+