Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsDC : స్పిన్ మాంత్రికుడి కోసం తప్పుకునేది ఎవరు?.. ఆర్సీబీ, ఢిల్లీ పోరాడే జట్లు ఇవే!

శ్రీలంక స్పిన్ మాంత్రికుడు వానిందు హసరంగ ఈ ఐపీఎల్‌లో ఎంట్రీకి రెడీగా ఉన్నాడు. శ్రీలంక సిరీస్ ఉండటంతో ఆరంభ మ్యాచులకు దూరమైన అతను.. ఇప్పుడు బెంగళూరు చేరుకొని తమ జట్టుతో కలిసి ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతన్ని ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో ఆడించాలని ఆర్సీబీ అనుకుంటోంది. అదే జరిగితే ఎడం చేతి వాటం పేసర్లు డేవిడ్ విల్లే, వేన్ పార్నెల్ ఇద్దరిలో ఒకర్ని తప్పించాల్సి ఉంటుంది.

ఈ ఏడాది డేవిడ్ విల్లే ఎక్కువ మ్యాచులు ఆడాడు. చక్కగా బౌలింగ్ చేశాడు. అవసరం అయితే బ్యాటుతోనూ రాణించగలడు. దీంతో తను ఆడిన మొదటి మ్యాచ్‌లో రాణించినా కూడా వేన్ పార్నెల్‌ను పక్కన పెట్టి హసరంగను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే హసరంగ వచ్చిన తర్వాత కర్ణ్ శర్మ సేవలు కూడా ఆర్సీబీకి అక్కర్లేదు. కానీ కర్ణ్ శర్మ కూడా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో ఇదర్నీ ఆడించే ఛాన్స్ కూడా ఉంది.

rcb dc teams

ఇక బెంగళూరు టాపార్డర్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో బ్యాటింగ్‌లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ్ల కర్ణ్ శర్మ వద్దనుకుంటే ఆకాష్ దీప్‌ను ఆడించే ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఢిల్లీ టాపార్డర్ అత్యంత ఘోరంగా ఆడుతోంది. డేవిడ్ వార్నర్ జిడ్డు బ్యాటింగ్, పృథ్వీ షా పేలవ ఫామ్ ఆ జట్టను పట్టి పీడిస్తున్నాయి. మిచెల్ మార్ష్ తిరిగి రావడంతో మిడిలార్డర్ కొంత బలంగా మారే అవకాశం కనిపిస్తోంది.

మార్ష్ కోసం రావ్‌మెన్ పావెల్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఇద్దరిలో ఒకరిని తీసేయాల్సి రావొచ్చు. రెహ్మాన్ డెత్ ఓవర్లలో చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. పావెల్‌ను తీసేస్తే మిడిలార్డర్‌లో పవర్ హిట్టర్లు కరువు అవుతారు. ఈ క్రమంలో ఎవరిని తీసేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లో కేవలం 2 పరుగులే చేసిన యష్ ధుల్‌ను కూడా డీసీ యాజమాన్యం పక్కన పెట్టేసే అవకాశం కనిపిస్తోంది. అతని కన్నా వెటరన్ మనీషా పాండేను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆర్సీబీ జట్టు (అంచనా) : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, వానిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ

ఢిల్లీ జట్టు (అంచనా) : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, మనీష్ పాాండే, రావ్‌మెన్ పావెల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, ఆన్రిచ్ నోకియా, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా

Story first published: Saturday, April 15, 2023, 13:44 [IST]
Other articles published on Apr 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+