Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsMI : అన్నదమ్ముల సవాల్.. ఢీకొట్టే సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ టీమ్స్ ఇవే!

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడేందుకు రెడీ అయ్యాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ ఐపీఎల్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన సన్‌రైజర్స్ ఇప్పుడే విజయాల బాట పట్టిన సంగతి తెలిసిందే.

గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. రాహుల్ త్రిపాఠీ కూడా బాగానే ఆడుతున్నాడు. వీరికితోడు కొత్త రోల్‌లో అభిషేక్ శర్మ కూడా చెలరేగుతున్నాడు. కేవలం మయాంక్ అగర్వాల్ మాత్రమే విఫలం అవుతున్నాడు. ఇప్పటి వరకు సన్‌రైజర్స్ ఆడిన ఒక్క మ్యాచ్‌లో కూడా అగర్వాల్ పెద్దగా రాణించలేదు.

marco jansen duan jansen

ఇక బౌలింగ్‌లో ఉమ్రాన్ మాలిక్ ధారాళంగా పరుగులు ఇస్తున్నా కూడా.. అతనిపై సన్‌రైజర్స్ గట్టి నమ్మకం ఉంచుతోంది. భువనేశ్వర్, మార్కో యాన్సెన్, నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. మయాంక్ మార్కండే గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సన్‌రైజర్స్ బెస్ట్ వికెట్ టేకర్ అతనే. ఈ క్రమంలో ముంబైతో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తమ జట్టులో పెద్దగా మార్పులు చేసేలా కనిపించడం లేదు.

అదే సమయంలో ముంబై కూడా ఇప్పుడే విజయాల బాట పట్టింది. వరుసగా రెండు విజయాలతో జోరు మీదుంది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ కూడా ఫామ్ అందుకున్నారు. దీంతో ముంబై బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది. అయితే బౌలింగ్‌లో ఎవరూ ఊహించని విధంగా తమ చివరి మ్యాచులో జేసన్ బెహ్రెండాఫ్‌ను ముంబై పక్కన పెట్టింది. గాయంతో జోఫ్రా ఆర్చర్ తప్పుకోవడంతో బెహ్రెండాఫ్ ఆ జట్టు ప్రధాన పేసర్ అవుతాడని అంతా అనుకున్నారు.

కానీ అతన్ని పక్కన పెట్టిన ముంబై.. డువాన్ యాన్సెన్‌ను ఆడించింది. కేవలం ఒక్క మ్యాచ్ తర్వాత అతన్ని పక్కన పెట్టే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి ఈ సారి అన్నదమ్ములైన మార్కో యాన్సెన్, డువాన్ యాన్సెన్ ఒకరితో ఒకరు పోటీ పడటం చూడొచ్చు. అర్జున్ టెండూల్కర్‌కు కూడా మరిన్ని అవకాశాలు ఇవ్వాలని ముంబై యాజమాన్యం అనుకుంటోందట. కాబట్టి ముంబైలో కూడా పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.

సన్‌రైజర్స్ జట్టు (అంచనా): మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిక్ క్లాసెన్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో యాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్

ముంబై ఇండియన్స్ జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, నేహాల్ వధీర, హృతిక్ షోకీన్, డువాన్ యాన్సెన్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్

Story first published: Tuesday, April 18, 2023, 11:28 [IST]
Other articles published on Apr 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+