Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsRR : స్టార్ పేసర్లు రిటర్న్.. రాజస్థాన్‌‌తో తలపడే రోహిత్ సేన ఇదే..!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన బర్త్ డే రోజు కీలక మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో అనూహ్యంగా ఓడిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. అదే సమయంలో ముంబైని ఓడించి మళ్లీ టేబుల్ టాపర్‌గా నిలవాలని రాజస్థాన్ భావిస్తోంది.

ప్రస్తుతం ఐపీఎల్‌లో అన్నింటి కంటే బెస్ట్ నెట్ రన్ రేట్ ఉన్న టీం రాజస్థాన్. ఈ కారణంగానే ఈ టీం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో ముంబై జట్టు కేవలం ఆరు పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. అయితే రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ పునరాగమనం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న గాయం కారణంగా చివరి మ్యాచ్ ఆడని అతను.. ఈ మ్యాచ్ ఆడేలా కనిపిస్తున్నాడు.

 MIvsRR

ఆర్చర్ తిరిగి జట్టులోకి వస్తే రైలీ మెరెడిత్‌ను పక్కన పెట్టడం ఖాయం. అలాగే ముంబై కనుక మొదట బ్యాటింగ్ చేస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా కుమార కార్తికేయను ఆడించే అవకాశం ఉంది. ఇక రాజస్థాన్ కూడా తమ టీంలో పెద్దగా మార్పులు లేకుండానే బరిలో దిగే ఛాన్స్ ఉంది. మంచి ఫామ్‌లో ఉన్న ఆ జట్టుకు మార్పులు చేయాల్సిన అవసరం కూడా లేదు.

అయితే గత మ్యాచ్‌లో చిన్న గాయం కారణంగా జట్టుకు దూరమైన ట్రెంట్ బౌల్ట్ కోలుకున్నాడని తెలుస్తోంది. దీంతో అతను ఈ మ్యాచ్ ఆడతాడు. అతను జట్టులోకి రావాలంటే ఆడమ్ జంపాను పక్కన పెట్టక తప్పదు. గత మ్యాచులో రాణించినా కూడా జంపా ఈ మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం అవడం గ్యారంటీగా కనిపిస్తోంది.

రాజస్థాన్ జట్టు (అంచనా): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్

ముంబై జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహాల్ వధీర, జోఫ్రా ఆర్చర్, అర్జున్ టెండూల్కర్, పీయూష్ చావ్లా, జేసన్ బెహ్రెండాఫ్

Story first published: Sunday, April 30, 2023, 10:29 [IST]
Other articles published on Apr 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+