Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsKKR : మెయిన్ పేసర్ లేని ముంబై.. కొత్త ఆయుధంతో కేకేఆర్.. ఢీకొట్టే జట్లు ఇవే!

ఈ సీజన్‌ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అత్యంత దిగువన ఉన్న రెండు జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. బడా బడా ప్లేయర్లు ఉన్నా కూడా ఆ జట్టు విజయాల బాట పట్టడంలో విఫలం అవుతోంది. అయితే చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగి, ముంబైకి తొలి విజయం అందించాడు. అతను అదే జోరు కొనసాగిస్తే ముంబై తలరాత మారే అవకాశం ఉంది.

అదే సమయంలో సన్‌రైజర్స్ చేతిలో థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఓడిన కేకేఆర్.. మళ్లీ విజయాల బాట పట్టేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఆఫ్ఘన్ వికెట్ కీపర్, కేకేఆర్‌ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ను పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతని స్థానంలో ఇంగ్లండ్ సెన్సేషన్ జేసన్ రాయ్‌ను ఆడించే ఛాన్స్ ఉంది. లేదంటే మరో విదేశీ ప్లేయర్‌ను పక్కన పెట్టి అయినా సరే జేసన్ రాయ్‌ను ఆడించాలని కేకేఆర్ అనుకుంటోందట.

mumbai indians kkr

ఇలాంటి టైంలో కూడా ముంబైని గాయాలు వెంటాడుతున్నాయి. ఆ జట్టు ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ భుజం గాయంతో చివరి మ్యాచ్‌లో ఆడలేదనే సంగతి తెలిసిందే. అతను కోల్‌కతా మ్యాచ్‌లో కూడా ఆడటం అనుమానంగానే ఉంది. అదే జరిగితే ముంబై బౌలింగ్ యూనిట్‌పై ఒత్తిడి మరింత పెరుగుతుంది. అతని స్థానంలో జేసన్ బెహ్రండాఫ్ రాణించినా.. ఆర్చర్ లేని లోటు స్పష్టంగా కనిపించడం ఖాయం.

తమ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేశాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఇద్దరూ చెలరేగారు. కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ కూడా ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించేందుకు వాళ్లు రెడీగా ఉన్నారు.

అదే సమయంలో కోల్‌కతా బ్యాటింగ్ లైనప్‌లో వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ నితీశ్ రాణా, రింకూ సింగ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురూ రాణిస్తే ముంబై మళ్లీ ఓడిపోయే ఛాన్స్ ఉంది.

ముంబై ఇండియన్స్ జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఎన్ వధీరా, హృతిక్ షోకీన్, అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, బెహ్రండాఫ్, రైలీ మెరెడిత్

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు (అంచనా): రహ్మనుల్లా గుర్బాజ్, నారాయణ్ జగదీశన్, సునీల్ నరైన్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సూయష్ శర్మ, లోకీ ఫెర్గూసన్

(ఎప్పట్లాగే వెంకటేశ్ అయ్యర్‌ను ఈ మ్యాచ్‌లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలో దించే అవకాశం ఉంది)

Story first published: Sunday, April 16, 2023, 9:46 [IST]
Other articles published on Apr 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+