Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DCvsSRH : సన్‌రైజర్స్‌లో కీలక మార్పులు.. ఢిల్లీతో తలపడే జట్టు ఇదే!

ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడేందుకు రెడీ అవుతున్నాయి. గత వారం హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఛేజింగ్ చేయలేక ఓడిన సన్‌రైజర్స్.. ఈసారి ఎలాగైనా ఆ టీంపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అదే సమయంలో సన్‌రైజర్స్‌పై అద్భుతమైన రికార్డున్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి కాన్ఫిడెన్స్ పెంచుకోవాలని చూస్తోంది.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు జరగనున్నాయి. గాయంతో ఆ టీం స్టార్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనేది ఎయిడెన్ మార్క్రమ్ బృందానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అలాగే ఏమాత్రం ఫామ్ లేక, జిడ్డు బ్యాటింగ్‌తో జట్టుకు భారంగా మారిన మయాంక్ అగర్వాల్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

SRH IPL Team Against DC

ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా తన బెస్ట్ పెర్ఫామెన్స్ చూపించాల్సి ఉంది. ఈ సీజన్‌లో పరుగులు చేస్తున్నా కూడా అతను అనుకున్నంత వేగంగా బ్యాటింగ్ చేయడం లేదు. అలాగే పృథ్వీ షా స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ఫిల్ సాల్ట్.. చివరగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అతను కూడా రాణించాల్సిన అవసరం ఉంది. ఇక మిడిలార్డర్‌లో మనీష్ పాండే ఆ టీంకు కీలకంగా మారాడు.

సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. అయితే ఉమ్రాన్ మాలిక్ కొంచెం గాడిన పడాల్సిన అవసరం ఉంది. అతన్ని సన్‌రైజర్స్ సరిగా ఉపయోగించుకోవడం లేదని నిపుణులు గగ్గోలు పెడుతున్నారు. రాహుల్ త్రిపాఠీ, మార్క్రమ్ కూడా బాధ్యతగా ఆడాలి. ఇక ఒక సెంచరీ తర్వాత బీరాలు పలికిన హ్యారీ బ్రూక్ కూడా తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే సన్‌రైజర్స్ వరుసగా నాలుగో మ్యాచులోనూ ఓడిపోయే ప్రమాదం ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు (అంచనా): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, మిచెల్ మార్ష్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అమన్ హకీం ఖాన్, రిపల్ పటేల్, ఆన్రిచ్ నోకియా, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (అంచనా): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిక్ క్లాసెన్, మార్కో జాన్సెన్, అబ్దుల్ సమద్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

Story first published: Saturday, April 29, 2023, 10:18 [IST]
Other articles published on Apr 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+