Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GTvsRR : టేబుల్ టాప్ ప్లేస్‌ కోసం పోటీ.. రాజస్థాన్, గుజరాత్ తలపడే జట్లు ఇవే!

ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కోసం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడేందుకు రెడీ అయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో తలపడే ఈ రెండు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి. తమ చివరి మ్యాచుల్లో ఘనవిజయాలు సాధించిన ఈ రెండు జట్లు.. అదే జోరు కొనసాగించి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాయి. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తమ ప్రధాన పేసర్ ట్రెంట్ బౌల్ట్ సేవలు మిస్ అయింది. అతను చిన్న గాయంతో జట్టుకు దూరమయ్యాడు. బౌల్ట్ ఇంకా కోలుకోలేదంటే.. నాలుగో విదేశీ ప్లేయర్‌గా ఎవరిని తీసుకోవాలనేది సంజూ శాంసన్ ముందుండే ప్రధాన ప్రశ్న. చివరి మ్యాచ్‌లో ఆడమ్ జంపా ఫర్వాలేదనిపించాడు .కాబట్టి అతన్నే కొనసాగిస్తారా? లేక మరో ఆటగాడిని ఆడిస్తారా? అని చూడాలి. బౌల్ట్ ఆడితే యువ పేసర్ కుల్దీప్ సేన్‌ను పక్కన పెట్టాల్సి రావొచ్చు.

gujarat titans rajasthan royals

అలాగే రియాన్ పరాగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్.. చెన్నైపై మంచి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మళ్లీ పరాగ్‌ను పక్కన పెట్టేసి పడిక్కల్‌నే కొనసాగించే అవకాశం ఉంది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ తడబడినా పడిక్కల్ రాణించాడు. ఈ కారణంతో అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఫామ్‌లో లేని రియాన్ పరాగ్‌కు ఇప్పుడప్పుడే అవకాశం దక్కడం కష్టంగా కనిపిస్తోంది. సంజూ శాంసన్ కూడా ఫామ్ అందుకుంటే రాజస్థాన్ మరింత బలంగా తయారవుతుంది.

ఇక గుజరాత్ టైటాన్స్‌లో యష్ దయాళ్ స్థానంలో వచ్చిన మోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కే ప్రదర్శనతో అలరించాడు. అతన్ని ఇప్పుడు పక్కన పెట్టడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఎక్స్‌ట్రా స్పిన్నర్ కావాలంటే ఆర్ సాయికిషోర్‌ను ఆడించే అవకాశం ఉంది. అంతకుమించి గుజరాత్ జట్టులో ఎలాంటి మార్పులూ చేయకపోవచ్చు. గుజరాత్ కనుక ఛేజ్ చేయాల్సి వస్తే.. విజయ్ శంకర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొనే ఛాన్స్ ఉంది.

గుజరాత్ టైటాన్స్ జట్టు (అంచనా) : శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, జోష్ లిటిల్, అల్జారీ జోసెఫ్, మోహిత్ శర్మ

రాజస్థాన్ రాయల్స్ జట్టు (అంచనా) : జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్

Story first published: Sunday, April 16, 2023, 13:25 [IST]
Other articles published on Apr 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+