డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ రెడీ అవుతోంది. తమ మొదటి మ్యాచ్‌లో లక్నో చేతిలో ఘోరంగా ఓడిన ఢిల్లీ.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్‌లో జరుగుతుండటం కూడా వారికి కలిసొచ్చే అంశమే. అయితే సౌతాఫ్రికా ప్లేయర్లు తిరిగి రావడంతో జట్టులో ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి? అనే సమస్య రెండు జట్లకు తలనొప్పిగా మారింది.
గుజరాత్ విషయానికి వస్తే.. గాయంతో ఈ సీజన్‌కు దూరమైన కేన్ విలియమ్సన్ స్థానాన్ని సఫారీ స్టార్ డేవిడ్ మిల్లర్ భర్తీ చేస్తాడు. మిల్లర్ వస్తే ఎవరో ఒక ఫారెన్ ప్లేయర్ జట్టు నుంచి తప్పుకోవాల్సిందే. కాబట్టి విలియమ్సన్ లేకపోవడం గుజరాత్‌కు కలిసొచ్చింది. ఇక ఓపెనర్లుగా సాహా, గిల్ కొనసాగుతారు. మూడో స్థానంలో సాయి సుదర్శన్ రాణిస్తున్నాడు. జోష్ లిటిల్ రాణిస్తున్నందున.. యష్ దయాళ్ ప్రభావం పెద్దగా లేదు. ఈ క్రమంలో మరో స్పిన్నర్ కావాలనుకుంటే ఆర్ సాయికిషోర్‌ను ఆడించొచ్చు.

సౌతాఫ్రికా ప్లేయర్లు తిరిగి ఐపీఎల్‌కు రావడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద తలనొప్పి వచ్చిపడింది. గత మ్యాచ్‌లో ఢిల్లీ వద్ద జెన్యూన్ పేసర్ లేడు. ఈ మ్యాచ్‌లో ఆ స్థానాన్ని సఫారీ పేసర్ ఆన్రిచ్ నోర్యీ భర్తీ చేసే అవకాశం ఉంది. కానీ అలా జరగాలంటే మరో విదేశీ ప్లేయర్ తప్పుకోవాలి. ఢిల్లీ ఆడిన మొదటి మ్యాచులో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రావ్‌మెన్ పావెల్, రైలీ రూసో బరిలో దిగారు. ఇప్పుడు నోర్యీ కోసం ఎవరిని పక్కన పెట్టాలనేది పెద్ద ప్రశ్న.
అతని కోసం మరో సఫారీ ప్లేయర్ రూసోను తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిడిలార్డర్‌లో రూసో లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్‌గా యూజ్ అవుతాడు. అలాగే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కానీ నోర్యీ కోసం అతన్ని తప్పించక తప్పదు. రూసో స్థానంలో లలిత్ యాదవ్, మనీష్ పాండేల్లో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. లలిత్ యాదవ్ అయితే బౌలింగ్ కూడా చేయగలడు. కానీ మనీష్ పాండే చాలా అనుభవం ఉన్న బ్యాటర్.
రిపల్ పటేల్, యష్ ధుల్ కూడా ఉన్నా వాళ్లు టాపార్డర్ బ్యాటర్లు కావడంతో మిడిలార్డర్‌లో ఆడటం కష్టం. అలాగే నోర్యీ రాకతో ముకేష్ కుమార్, సకారియా పాత్రలు తగ్గిపోతాయి. మినీ వేలంలో గట్టిగా పోటీ పడి మరి ముకేష్ కుమార్‌ను డీసీ కొనుగోలు చేసింది. లక్నోతో మ్యాచులో కూడా ముకేష్ ఆకట్టుకున్నాడు. దీంతో సకారియాను పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా ఎవరిని తీసేస్తే ఎవరితో ఆ స్థానాన్ని భర్తీ చేయాలనే సమస్య డీసీకి పెద్ద తలనొప్పిగా మారింది. వాళ్ల దగ్గర అన్ని ఆప్షన్స్ ఉండటమే దీనికి కారణం.
గుజరాత్ టైటాన్స్ జట్టు (అంచనా): శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, జోష్ లిటిల్
ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్: ఆర్ సాయి కిషోర్, యష్ దయాళ్, అభినవ్ మనోహర్, కేఎస్ భరత్, జయంత్ యాదవ్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు (అంచనా): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, రావ్‌మెన్ పావెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఆన్రిచ్ నోర్యీ, ఖలీల్ అహ్మద్, ముకేష్ కుమార్
ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్: అమన్ హకీమ్ ఖాన్, చేతన్ సకారియా, రిపల్ పటేల్, యష్ ధుల్, లలిత్ యాదవ్