Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGvsSRH : ఆ ముగ్గుర్నీ సన్‌రైజర్స్ ఎలా ఆడిస్తారు?.. లక్నోతో ఆడే జట్టు ఇదే!

సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ రెండు జట్లు ఐపీఎల్ 2023లో ఢీకొట్టేందుకు రెడీ అయ్యాయి. లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ ముందు రెండు జట్లకు సెలెక్షన్ పెద్ద తలనొప్పిగా మారింది. సౌతాఫ్రికా ప్లేయర్లు ఐపీఎల్‌కు తిరిగి రావడమే ఈ జట్లకు ఈ తియ్యని తలనొప్పి తీసుకొచ్చింది. సన్‌రైజర్స్‌లో ముగ్గురు కీలకమైన సఫారీ ప్లేయర్లు ఉండగా.. లక్నోలో ఓపెనింగ్ స్పాట్ కోసం పోటీ నెలకొంది.

లక్నో ఓపెనర్‌గా గతేడాది క్వింటన్ డీకాక్ రాణించాడు. ప్రస్తుతం కూడా అతను ఫర్వాలేదు మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. అయితే అతన్ని తీసుకోవాలంటే కైల్ మేయర్స్‌ను లక్నో పక్కన పెట్టాల్సి ఉంటుంది. లక్నో ఆడిన రెండు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలతో చెలరేగిన అతన్ని పక్కన పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్‌ను పక్కన పెట్టి డీకాక్‌ను మిడిలార్డర్‌లో ఆడించే అవకాశం కనిపిస్తోంది.

LSGvsSRH Today IPL match

ఇక సన్‌రైజర్స్‌లో అయతే కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్, కీపర్ హెన్రిక్ క్లాసెన్, పేసర్ మార్కో జాన్సెన్.. ముగ్గురూ ఆడాల్సిన వాళ్లే. సన్‌రైజర్స్ ఆడిన ఏకైక మ్యాచ్‌లో రాణించిన ఫజల్లాక్ ఫరూఖీని జాన్సెన్ కోసం పక్కన పెట్టేస్తారా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మార్క్రమ్ కెప్టెన్సీలో బంతితోపాటు బ్యాటుతోనూ జాన్సెన్ రాణించాడు. దీంతో అతనిపై ఐపీఎల్‌లో కూడా పెద్ద బాధ్యత పెట్టే అవకాశం ఉంది.

లేదంటే ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. అతన్ని పక్కన పెడితే సన్‌రైజర్స్ వద్ద క్వాలిటీ స్పిన్నర్ కరువు అవుతాడు. అలాంటప్పుడు మయాంక్ మార్కండే వంటి ఆటగాళ్లను ఆడించాల్సి ఉంటుంది. మరి సన్‌రైజర్స్ అదే చేస్తారా? లేక జాన్సెన్‌కు విశ్రాంతి ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఈ కీలకమైన సఫారీ ప్లేయర్లు చేరడంతో సన్‌రైజర్స్ పూర్తి బలంగా కనిపిస్తోంది.

సన్‌రైజర్స్ జట్టు (అంచనా): మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, హెన్రిక్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

లక్నో జట్టు (అంచనా): కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, క్వింటన్ డీకాక్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, మార్క్ వుడ్, ఆవేష్ ఖాన్, యష్ ఠాకూర్, రవి బిష్ణోయి

Story first published: Friday, April 7, 2023, 17:05 [IST]
Other articles published on Apr 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+