
పుల్వామా ఘటన చోటు చేసుకున్న తరువాత పాకిస్తాన్ తో ప్రపంచ కప్ ఆడకూడదన్న డిమాండ్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత క్రికెటర్ హర్బజన్ పాకిస్తాన్ తో ఎట్టి పరిస్థితిలో క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని కొండబద్దలు కోటినాడు. అలాగే రాజీవ్ శుక్లా కూడా ప్రపంచ కప్ లో పాకిస్తాన్ ఆడేది కష్టమేనని మాట్లాడినాడు.
మాజీ బీసీసీఐ సెక్రటరీ సంజయ్ పటేల్ మాట్లాడుతూ ''దేశం కంటే క్రికెట్ ఎక్కువ కాదని ఓక వేళ పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడినట్లైతే దేశం కంటే క్రికెట్ ఎక్కువేనని ఒప్పుకున్నట్లు అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఉగ్రవాదం ఆపినప్పుడే మ్యాచ్ లు జరుగుతాయని , ఒక పక్క పాకిస్తాన్ దాడి వల్లన మా సోదరులను కోల్పోతే ఎలా క్రికెట్ అడగలమని '' చెప్పుకొచ్చాడు.
దేశ పౌరుల భద్రత కంటే ఏది ఎక్కువ కాదని అలా కాకుండా పాకిస్తాన్ తో ఆడాలని అనుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని , బీసీసీఐ కూడా ఇటువంటి నిర్ణయమే తీసుకోవాలని సూచించాడు. అయితే ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాళ్ల ఫోటోలను తొలిగించిన సంగతి తెలిసిందే. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగర్ కు ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న రిలయన్స్ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీనితో అన్ని వైపులా నుంచి పాకిస్తాన్ ను ఒంటరి ని చేసే ప్రయత్నం భారత్ చేస్తుంది.