For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కివీస్ టూర్‌ను క్లిష్టమైన పర్యటనగా అభివర్ణించిన కోహ్లీ

Ind vs New Zealand : Virat Kohli : Playing Well-Balanced Kiwi Side Is The Toughest Challenge For Us
Playing well-balanced Kiwi side is the toughest challenge for us, admits Virat Kohli

హైదరాబాద్: క్రికెట్లో సూపర్ పవర్‌గా ఎదిగే క్రమంలో టీమిండియాకు కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని కివీస్ ఓ పెద్ద అడ్డంకి అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆస్ట్రేలియాలో జైత్రయాత్ర సాగించిన కోహ్లీసేన రెట్టించిన ఉత్సాహంతో పక్కనే ఉన్న న్యూజిలాండ్‌లో అడుగుపెట్టింది. ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీసుల్లో తలపడనుంది.

తొలి వన్డేకి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ "దక్షిణాఫ్రికాలో పేస్ బౌలింగ్ చూశాం, ఇంగ్లాండ్‌లో స్వింగ్ బౌలింగ్ చూశాం, ఆస్ట్రేలియా గడ్డపై బౌన్స్ బౌలింగ్ చూశాం కానీ న్యూజిలాండ్ సిరిస్‌లో ఈ మూడు ఒకేసారి చూడనున్నాం. వీటితో బాటు చల్లని వాతావరణం. అందుకే అత్యంత క్లిష్టమైన టూరు న్యూజిలాండే నని చెప్పక తప్పదు" అని అన్నాడు.

2014లో టీమిండియా

2014లో టీమిండియా

2014లో టీమిండియా 4-0 తేడాతో వన్డే సిరీస్‌ని, 1-0 తేడాతో టెస్టు సిరీస్‌ని ఓడిపోయిన విషయం గురించి కోహ్లీ మాట్లాడుతూ అనుభవం లేకపోవడంతో ఆ సిరీస్ కోల్పోయామని.. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవని సమతూకంతో ఉన్న టీమిండియా ఈ సిరీస్ ను విజయవంతంగా పూర్తి చేయగలదని ధీమా వ్యక్తం చేశాడు.

కివీస్ జట్టుని

కివీస్ జట్టుని

గత కొన్ని సంవత్సరాలుగా నిలకడగా ప్రదర్శన చూపుతున్న కివీస్ జట్టుని విరాట్ కోహ్లీ మెచ్చుకుంటూ వారి నుండి గట్టి పోటీ ఎదురుకానుందని తెలిపాడు. "ఆ జట్టు మూడో ర్యాంకులో ఉండటం కొన్నేళ్లుగా న్యూజిలాండ్‌ ఎంత నిలకడగా ఆడుతుందన్న దానికి ఉదాహరణ. గత సిరీస్‌లో వారిని ముంబయిలో ఓడించాం. మిగతా అన్ని మ్యాచుల్లో గట్టి పోటీనిచ్చారు. ఆ జట్టు సమతూకంగా ఉందని మాకు తెలుసు. ప్రత్యర్థి ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. సక్రమంగా, నిబద్ధతతో క్రికెట్‌ ఆడే కివీస్‌ను‌ కచ్చితంగా అభినందించి తీరాల్సిందే" అని అన్నాడు.

అత్యధిక స్కోరు నమోదు కావడంపై

అత్యధిక స్కోరు నమోదు కావడంపై

కివీస్‌లో అత్యధిక స్కోరు నమోదు కావడంపై కోహ్లీ స్పందిస్తూ గ్రౌండ్స్ చిన్నవి కావడంతో భారీ స్కోరులు నమోదవుతున్నాయని.. ప్రత్యర్థి జట్టు 300 పరుగుల కంటే ఎక్కువ స్కోరు చేసిన ఎటువంటి ఇబ్బంది లేకుండా చేజ్ చేయగలమనే ధీమా వ్యక్తం చేశాడు. ముగ్గురు బౌలర్లను తీసుకుంటారా అనే ప్రశ్నకు కోహ్లీ ఎటువంటి జవాబివ్వకుండా జట్టులో ఆల్‌రౌండర్ ఉండడంపై ఆధారపడి వుంటుందని తెలిపాడు.

జట్టుకి సమతూకంగా

జట్టుకి సమతూకంగా

ఇద్దరూ లేదా ముగ్గురు ఆల్ రౌండర్స్ ఉన్న విషయాన్ని కోహ్లీ గుర్తు చేస్తూ వారు జట్టులో ఉంటే జట్టుకి సమతూకంగా.. బౌలింగ్ ఆప్షన్స్ పెరుగుతాయని అభిప్రాయపడ్డాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్ జట్టులో ఉంటే మూడో సీమర్ అవసరం లేదని కోహ్లీ చెప్పాడు. గత 43 సంవత్సరాల్లో 2009 మినహా ఎన్నడూ సిరీస్ గెలవని టీమిండియా కివీస్ ఛాలెంజ్‌ని ఎలా ఎదుర్కోనుందో చూడాలి.

Story first published: Tuesday, January 22, 2019, 19:33 [IST]
Other articles published on Jan 22, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+