కెప్టెన్సీ ఒత్తిడిపై కోహ్లీ: రెండో ఆటగాడిగా (ఫోటోలు)
విశాఖపట్నం: కెప్టెన్‌గా తాను ఎదుర్కొంటున్న ఒత్తిడిని ఇప్పుడు బాగానే ఎంజాయ్ చేస్తున్నానని, కెప్టెన్సీ భారాన్ని మరో మూడేళ్ల తర్వాత మాత్రమే అంచనా వేయగలుగుతానని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో 246 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన అనంతరం కోహ్లి మీడియాతో మాట్లాడాడు.
'బహుశా మూడు నాలుగేళ్ల తర్వాత మాత్రమే కెప్టెన్సీ భారం ఎంతగా నాపై ఉందో అంచనా వేయగలుగుతాను. ప్రస్తుతానికయితే నేను కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తున్నాను' అని చెప్పాడు. ప్రస్తుతం కోహ్లీ ఈ క్యాలెండర్ ఇయర్‌లో అన్ని అంతర్జాతీయ ఫార్మట్లలో కలిపి ఇప్పటి వరకూ 2277 పరుగులు సాధించి రెండో స్ధానంలో ఉన్నాడు.

అగ్రస్ధానంలో జో రూట్
2285 పరుగులతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ మొట్టమొదటి స్ధానంలో ఉన్నాడు. ‘టెస్టు క్రికెట్‌లో బ్యాటింగ్ చేయడానికి వెళ్లినప్పుడు కెప్టెన్‌గా ఉన్న విషయం నుంచి దూరంగా ఉండడం చాలా కష్టం. టెస్టుల్లో బహుశా బాధ్యత మరింత పెరగవచ్చు. అయితే అదే నన్ను గాలిలోకి బంతిని ఆడకుండా కూడా చేస్తోంది' అని కోహ్లీ చెప్పాడు.

టెస్టుల్లో క్రీజులో ఎక్కువ సేపు ఉంటే ఒత్తిడి తగ్గతుంది
'నిజానికి టెస్టు క్రికెట్‌లో సంప్రదాయానికి భిన్నంగా ఆడే స్ట్రోక్స్‌పై తనకు నమ్మకం ఉందన్న కోహ్లీ అందువల్లనే టెస్టు క్రికెట్‌లో నేను తరచూ ఆడే గాలిలోకి బంతిని కొట్టే షాట్లను ఆడకుండా కూడా చేసింది' అని చెప్పాడు. టెస్టుల్లో క్రీజులో ఎక్కువ సేపు ఉంటే అంత ఒత్తిడి తగ్గుతుందని, మిగతా ఫార్మెట్లలో అలా కాదని అన్నాడు.

అడిలైడ్ మాదిరి విశాఖ గ్రౌండ్ నాకు అచ్చొచ్చిన గ్రౌండ్
విశాఖపట్నం నాకు అచ్చొచ్చిన గ్రౌండ్ అని కోహ్లీ తెలిపాడు. అడిలైడ్ మాదిరిగా ఈ మైదానం కూడా నాకు అచ్చొచ్చింది. పిచ్ సహకారం పక్కనపెడితే మా బ్యాట్స్‌మెన్, బౌలర్లు బాగా రాణించారని తెలిపాడు. రెండో టెస్టులో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగడం కలిసొచ్చిందని పేర్కొన్నాడు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచామని, తొలి టెస్టు అయినా జయంత్ బాగా ఆడాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు చక్కటి పోరాటస్ఫూర్తిని ప్రదర్శించారని ప్రశంసించాడు.

రెండో టెస్టు విజయంలో బౌలర్లు ప్రధాన పాత్ర
విశాఖ టెస్టుకు హాజరైన ప్రేక్షకులకు ఆనందాన్ని అందించగలిగామని అన్నాడు. ఈ మ్యాచ్‌లో అయిదు సెషన్లలో బ్యాటింగ్ చేసి 450 పరుగులకు పైగా స్కోరు చేయగలిగామని, బౌలర్లు ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించారని అన్నాడు. ఈ మ్యాచ్‌లో తాను బ్యాటింగ్‌లో రాణించి 248 పరుగులు చేయడం ఆనందంగా ఉందని అన్నాడు. ఈ మ్యాచ్ ద్వారా డెబ్యూగా జట్టులోకి అడుగుపెట్టిన జయంత్ తన టాలెంట్ నిరూపించుకున్నాడని అన్నాడు. అయిదుగురు బౌలర్లను ఈ మ్యాచ్‌లో తీసుకోవడం ఫలితాన్ని ఇచ్చిందని కోహ్లీ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications