For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్యూట్‌గా ఉన్నాడని చేజ్ చేశా: సచిన్‌పై అంజలి వెల్లడి

By Pratap

ముంబై: తన తల్లి కోసం విమానాశ్రయానికి వచ్చినప్పుడు మొదటిసారి సచిన్ టెండూల్కర్‌ను చూసినట్లు అంజలి చెప్పారు. సచిన్ టెండూల్కర్ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకం విడుదల కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ సతీమణి అంజలి పాల్గొన్నారు. చాలా క్యూట్‌గా ఉన్నాడనిపించి సచిన్‌ను చేజ్ చేశానని ఆమె చెప్పారు. దాంతో అతను ఇబ్బంది పడినట్లు కనిపించాడని చెప్పారు. సచిన్‌కు అప్పుడు 17 ఏళ్లున్నాయని ఆమె చెప్పారు.

బాల్యంలో కూడా సచిన్ వద్ద అన్నింటికీ సమాధానం ఉండేదని అజిత్ టెండూల్కర్ అన్నారు. అందుకే అతన్ని అచ్రేకర్ సార్ వద్దకు తీసుకుని వెళ్లానని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియాపై సిడ్నీ టెస్టుకు ముందు నాటవుట్‌గా మిగలాలని అజిత్ సవాల్ చేశాడని, 241 పరుగులు చేసి నాటవుట్‌గా మిగలడానికి అది పనిచేసిందని సచిన్ టెండూల్కర్ చెప్పారు.

Playing It My Way: When Anjali met Tendulkar first time?

తొలి సారి తనను వాళ్ల ఇంటికి పిలిచినప్పుడు సచిన్ టెండూల్కర్ కాస్తా సంకోచించాడని, ఇంట్లోవాళ్లందరికీ తనను జర్నలిస్టుగా పరిచయం చేయాలనే ప్లాన్ వేసుకున్నాడని, సచిన్‌ను తాను కలిసినప్పుడు 1990లో టెక్నాలజీ ఇంతగా లేదని, తన మెడికల్ క్యాంపస్ దాటి టెలిఫోన్ బూత్‌కు వెళ్లి సచిన్‌కు ఫోన్ చేసేదాన్నని అంజలి చెప్పారు. టెలిఫోన్ బిల్లుకయ్యే ఖర్చులను తగ్గించుకోవడానికి సిడ్నీలో ఉన్నప్పుడు సచిన్‌కు లేఖలు రాయాలని అనుకున్నట్లు ఆమె తెలిపారు.

జీవితం ఎప్పుడూ తేలిక కాదని, అతని చుట్టూ ఉండకపోతే చక్కబెట్టడం కష్టమేనని, సచిన్‌ను గానీ ఆయన క్రికెట్ షెడ్యూల్‌ను గానీ ఎప్పుడూ డిస్టర్బ్ చేయదలుచుకోలేదని, తనకు 21 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులతో నిశ్చితార్థం గురించి మాట్లాడాలని చెప్పి పంపించారని ఆమె చెప్పారు. తన తండ్రి చనిపోయిన విషయాన్ని సచిన్‌కు చెప్పినప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని అంజలి చెప్పారు.

ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం కన్నా కష్టమైంది...

తన తల్లిదండ్రులతో అంజలితో నిశ్చితార్థం గురించి మాట్లాడడం ఫాస్టెస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం కన్నా ఎక్కువ కష్టమైందని సచిన్ టెండూల్కర్ అన్నారు. తనకు అజిత్ ఎన్నో చేశాడని, తన కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి చాలా చేశాడని, ఇండియాకు ఆడాలనే కలను ఇద్దరం కలిసి కన్నామని, తాను ఒత్తిడికి గురైనప్పుడు ఆయన కూడా ఒత్తిడికి గురయ్యేవాడని సచిన్ చెప్పారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+