ఇంగ్లాండ్, ఐర్లాండ్ ప్రదేశాల్లో నా బౌలింగ్‌కు చక్కటి ప్రదేశం

హైదరాబాద్: బీసీసీఐ ఐపీఎల్ అనంతరం ఏం చేయాలా అనే దానిపై ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్, ఐర్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్, అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు గానూ మంగళవారం జాతీయ జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ పేస్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్‌కు మరోసారి జాతీయ జట్టులో స్థానం దక్కింది.
ఇంతకుముందు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కౌల్ జాతీయ జట్టుకు ఎంపికైనా ఆ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకపోవడంతో నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ప్రస్తుత ఐపీఎల్‌లో పదునైన పేస్‌తో..చక్కటి స్వింగ్‌తో కౌల్ అద్భుతంగా ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే టోర్నీలో ఆడిన పది మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టి ఈ సీజనులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

సన్‌రైజర్స్ బౌలర్లలో అత్యధిక వికెట్ల ఘనత:
మరోవైపు సన్‌రైజర్స్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన ఘనత ఇతని పేరు మీదే ఉంది. కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సమయంలో జాతీయ జట్టుకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందంటున్నాడు ఈ కుడి చేతి వాటం బౌలర్. జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంగా కౌల్ మాట్లాడాడు.

జాతీయ జట్టుకు ఆడటమనేది ఓ కల:
దేశం తరఫున ఆడాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటాడు. జాతీయ జట్టుకు ఆడటమనేది ఓ కలలాంటింది. ఇంతకుముందు శ్రీలంకతతో వన్డే సిరీస్‌కు ఎంపికైనా..తుది జట్టులో స్థానం దక్కలేదు. మళ్లీ జాతీయ జట్టుకు ఎంపిక కావడం..అందులోనూ ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లలో ఆడటం గొప్ప అవకాశం. అక్కడి పరిస్థితులు నా బౌలింగ్ శైలికి అనుకూలంగా ఉంటాయి.

అత్యుత్తమ ప్రదర్శనకు వాళ్లే కారణం:
ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడటమే నా కెరీర్‌కు పెద్ద మలుపు. అత్యుత్తమ ప్రదర్శన రావడానికి కోచ్ టామ్ మూడీ, కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రధానం కారణం. వారిద్దరూ నన్ను దగ్గరుండి ప్రోత్సహించారు. పరిస్థితులకు అనుగుణంగా ఏవిధంగా రాణించాలో..ఒత్తిడిలో అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడమెలాగో వారి నుంచే నేర్చుకున్నానని' కౌల్ చెప్పాడు.

కోహ్లీ నాయకత్వంలో అండర్-19
2008లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో అండర్-19 జట్టులో సభ్యుడిగా ఉన్న కౌల్..మళ్లీ తప్పకుండా కోహ్లీ నాయకత్వంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని ఇటీవలే నమ్మకాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications