టోర్నీ గెలవాలంటే ఏ ఒక్కరిద్దరో ఆడితేనో గెలవలేం: రోహిత్ శర్మ
హైదరాబాద్: కోహ్లీసేన విజయ రహస్యం ఏంటో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. సోమవారం ముంబైలోని ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న రోహిత్ మీడియాతో మాట్లాడాడుతూ ఆటగాళ్లందరూ కలిసికట్టుగా రాణించడం వల్లే టీమిండియా వరుస విజయాలకు ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు.

ఈ విజయం ప్రతి ఒక్కరిది
'ప్రస్తుతం మా ఆటతీరు ఘనత అందరికీ చెందుతుంది. ఈ విజయం ప్రతి ఒక్కరిది. మేను ఆడుతున్నది నగరానికో, దేశానికో కాకుండా గెలుపే ముఖ్యంగా భావిస్తాం. కానీ ఇది అంత సులభం కాదు. మేము వరుసగా ఆరు సిరీస్‌లు గెలిచాం. కలిసికట్టుగా రాణించడంతోనే ఈ విజయాలు సులువయ్యాయి' అని రోహిత్ శర్మ అన్నాడు.

టోర్నీ గెలవాలంటే ఏ ఒక్కరిద్దరో ఆడితేనో గెలవలేం
అంతేకాదు జట్టు కలిసికట్టుగా ఆడకుంటే నిలకడగా ప్రదర్శనలు చేయడం కష్టమని రోహిత్ చెప్పాడు. 'టోర్నీ గెలవాలంటే ఏ ఒక్కరిద్దరో ఆడితేనో గెలవలేం. జట్టుగా ఆడేటప్పుడు అందరి తోడ్పాటు ఎంతో కీలకం. ప్రస్తుతం జట్టంతా ఒక లక్షఅయం వైపు ప్రయాణిస్తోంది. అది జట్టుకు మంచిదే' అని రోహిత్ శర్మ అన్నాడు.

వరల్డ్ కప్‌కు చాలా సమయం ఉంది
'ఇక వరల్డ్ కప్‌కు చాలా సమయం ఉంది. ఇప్పుడే దాని గురించి మాట్లడటం సమంజసం కాదు. అయితే మేం అందుకు సన్నాహాలు మొదలెట్టాం. ప్రపంచకప్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. కెప్టెన్, కోచ్, సెలక్టర్లు ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని జట్టును సిద్దం చేస్తున్నారు. జట్టు మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల నుంచి ఏం ఆశిస్తుందో అందరికీ తెలుసు' అని రోహిత్ అన్నాడు.

హోటల్‌కు చేరిన మరుక్షణం మా ప్రణాళికలను ప్రారంభిస్తాం
ఇక న్యూజిలాండ్‌తో అక్టోబర్ 22 నుంచి జరిగే పరిమిత ఓవర్ల సిరిస్‌పై కూడా రోహిత్ శర్మ స్పందించాడు. 'ఇప్పటికీ ఎలాంటి ప్రణాళికలు లేవు. జట్టు సభ్యులంతా హోటల్‌కు చేరిన మరుక్షణం మా ప్రణాళికలను ప్రారంభిస్తాం. రెండు రోజుల క్రితమే ఓ సిరీస్‌ను గెలుపుతో ముగించాం. మా ప్రత్యర్థిని ఓడించడమే మా లక్ష్యం' అని చెప్పాడు. కాగా, మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications