Asia cup Final : ఫైనల్లో రెండు మార్పులతో పాక్.. సేమ్ టీంతో లంక, తుది జట్లు ఇవే..! గెలవడానికి అది కీలకం

ఆసియాకప్ 2022లో శ్రీలంక జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్ 4దశలో ఆ జట్టు వరుసగా మూడో విజయాన్నందుకుంది. పాకిస్థాన్‌తో శుక్రవారం జరిగిన సూపర్ 4 చివరి మ్యాచ్‌లో శ్రీలంక 5వికెట్ల తేడాతో గెలుపొందింది. కీలక ఫైనల్ ముందు జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను చిత్తు చేసిన ఆ జట్టు.. ఫైనల్లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. వానిందు హసరంగా (3/21), మహీశ్ తీక్షణ(2/21), ప్రమోద్ మదుషన్(2/21) పాక్ పతనాన్ని శాసించారు.
122పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 17ఓవర్లలోనే 5 వికెట్లకు 124పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(48బంతుల్లో 55నాటౌట్) హాఫ్సెంచరీతో మెరిశాడు. చివర్లో భానుక రాజపక్స(24), డసన్ షనక(21) విజయాన్ని ఖాయం చేశారు. ఇకపోతే నేడు దుబాయ్ వేదికగా సాయంత్రం 7.30కు మొదలయ్యే ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగబోతున్నాయి.. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

దుబాయ్ పిచ్ అంటే దానికి పెట్టింది పేరు
దుబాయ్ పిచ్ టాస్‌కు పెట్టింది పేరు. ముందుగా టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేననే పరిస్థితి ఈ పిచ్‌పై ఉంది. ఇక ఇక్కడ జరిగిన 30టీ20ల్లో 26సార్లు ఛేజింగ్ జట్టు గెలిచింది. అందువల్ల టాస్ కీలకం కానుంది. టీ20లలో ఇప్పటివరకు పాకిస్థాన్, శ్రీలంక జట్లు 22మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 22 మ్యాచ్‌లలో పాకిస్థాన్ 13మ్యాచ్‌లు గెలవగా, శ్రీలంక 9సార్లు విజయం సాధించింది. ఇక ఆసియాకప్ ఫైనల్లో మూడుసార్లు శ్రీలంక, పాకిస్థాన్ తలపడ్డాయి. 1986, 2000 సంవత్సరాల్లో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో పాక్ గెలవగా, 2014లో శ్రీలంక గెలిచింది.

వాళ్లిద్దరు బరిలోకి
నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టులోని వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ అలాగే ఫాస్ట్ బౌలర్ నసీమ్ షాలకు విశ్రాంతినిచ్చారు. వీరిద్దరు ఫైనల్ మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి వస్తారు. వారు ఈ టోర్నీలో అద్బుత ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ విజయానికి వీరిద్దరి బౌలింగ్ చాలా కీలకం కానుంది.
పాక్ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్ల మీద ఆధారపడుతున్నప్పటికీ.. స్పిన్ విభాగంలోనూ పటిష్ఠంగానే కన్పిస్తుంది. నషీమ్ షా, హరీస్ రౌఫ్, హాస్నైన్ పేస్ విభాగం చూసుకుంటారు. నవాజ్, షాదాబ్ స్పిన్ విభాగాన్ని చూసుకుంటారు.

విజయవంతమైన జట్టుగా..!
ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌లోని సూపర్4 దశలో శ్రీలంక విజయవంతమైన జట్టుగా నిలిచింది. మొత్తం 3మ్యాచ్‌లను గెలుచుకున్న ఆ జట్టు 6పాయింట్లతో టేబుల్లో అగ్రస్థానంలో ఉంది. ఆఫ్ఘన్, ఇండియా, పాక్‌లను ఓడించి అనూహ్య రీతిలో చెలరేగిపోతుంది. ఇప్పుడు ఫైనల్ ట్రోఫీపై ఆ జట్టు కన్నేసింది.
ఆ జట్టు ప్రధాన బలం.. జట్టులో పెద్దగా మార్పులు చేయకుండా కొనసాగించడం.. గత కొన్నాళ్ల పాటు ఒకే జట్టు వివిధ టోర్నీల్లో ఆడుతుండడంతో జట్టు ప్లేయర్ల మధ్య మంచి కోఆర్డినేషన్, ఎవరి పాత్ర ఏంటనేది స్పష్టంగా ఉంది. ఇక పాకిస్థాన్‌తో ఆడిన జట్టే ఫైనల్లో బరిలోకి దిగే వీలుంది.

తుది జట్ల అంచనా
పాకిస్థాన్ ప్లేయింగ్ XI: మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజామ్ (కెప్టెన్), ఫాఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఆసిఫ్ అలీ, ఖుష్దిల్ షా, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్
శ్రీలంక ప్లేయింగ్ XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications