INDvsSL: ఈ సిరీస్ తర్వాత.. టీమిండియాలో వీళ్లు కనపడరు!

శ్రీలంకతో టీ20 సిరీస్‌ను భారత్ నెగ్గినా కూడా కొందరు ఆటగాళ్ల ఆటతీరు మాత్రం ఎవరికీ నచ్చలేదు. ఎన్నో అంచనాలతో జట్టులోకి వచ్చిన సదరు ఆటగాళ్లు అత్యంత చెత్త ప్రదర్శనలతో అందర్నీ నిరాశపరిచారు. ఈ క్రమంలో ముఖ్యంగా ముగ్గురు యువ ఆటగాళ్లు తమ చెత్త ప్రదర్శన వల్ల మళ్లీ టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఆ ఆటగాళ్లు ఎవరో చూస్తే..

ఇషాన్ కిషన్
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్.. సడెన్‌గా భారత జట్టులో ఫస్ట్ చాయిస్ ఓపెనర్‌గా మారిపోయాడు. ఈ క్రమంలోనే అతన్ని శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ ఈ సిరీస్‌లో ఇషాన్ కిషన్ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో 37 పరుగులతో ఫర్వాలేదనిపించిన అతను.. ఆ తర్వాతి రెండు మ్యాచుల్లో వరుసగా 1, 2 స్కోర్లు నమోదు చేశాడు.
అసలే జట్టుకు సరైన ఓపెనింగ్‌లో లేవని ఆందోళన చెందుతున్న సమయంలో కిషన్ ఇలా వికెట్ పారేసుకోవడం మేనేజ్‌మెంట్‌కు నచ్చినట్లు కనిపించడం లేదు. అభిమానులు కూడా కిషన్ ఆటతీరుపై పెదవి విరుస్తున్నారు. దీంతో మళ్లీ పొట్టి ఫార్మాట్‌లో కిషన్‌కు ఛాన్స్ దక్కకపోవచ్చు.

శుభ్‌మన్ గిల్
ఈ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు. తొలి రెండు మ్యాచుల్లో వరుసగా 7, 5 స్కోర్లకే పెవిలియన్ చేరిన అతనికి మూడో మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో 46 పరుగులు చేసినప్పటికీ తన స్లో ఆటతో అందరికీ విసుగు తెప్పించాడీ యువ ఓపెనర్. రాహుల్ త్రిపాఠీ, సూర్యకుమార్ యాదవ్ కనుక ఒక రేంజ్‌లో ఎదురు దాడి చేయకపోతే గిల్ వల్లనే ఈ మ్యాచ్ ఓడిపోయే వాళ్లమని అభిమానులు కూడా మండిపడ్డారు.
ఇలా నెమ్మదైన ఆటతీరు కనబరుస్తున్న గిల్‌కు మళ్లీ టీ20ల్లో అవకాశం దొరకదని సమాచారం. బీసీసీఐ కూడా జట్టుకు భారీ ఓపెనింగ్‌లు ఇచ్చే ఆటగాళ్ల కోసం చూస్తోంది. పృథ్వీ షా వంటి ఆటగాళ్లను పక్కన పెట్టి మరీ గిల్‌కు అవకాశం ఇస్తే అతను దాన్ని వేస్ట్ చేసుకున్నాడు.

హర్షల్ పటేల్
కొంత కాలంగా తను ఆడిన ప్రతి టీ20 సిరీస్‌లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్న బౌలర్ హర్షల్ పటేల్. తన వేరియేషన్స్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే అతను ఆ టచ్ కోల్పోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో అతన్ని ఆడించారు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసుకున్న పటేల్.. 10.75 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. ఇంతకుముందు కూడా ఇలాగే అతను ధారాళంగా పరుగులు ఇస్తుండటంతోనే అతన్ని టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడించలేదు. ఈ పరిస్థితి మారకపోవడంతో ఇక ముందు అతన్ని టీ20ల్లోకి తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications