Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ ఏడాది ఎక్కువ వికెట్లు ఏ బౌల‌ర్ తీశాడో తెలుసా?

Players who have taken the most wickets in international cricket 2021 year

చూస్తుండ‌గానే 2021 సంవ‌త్స‌రం ముగింపు ద‌శ‌కు చేరుకుంది. త్వ‌ర‌లోనే కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్ట‌బోతున్నాం. ఈ ఏడాది మొద‌టి 6 నెల‌లు క‌రోనాతో గ‌డిచిపోగా, మిగ‌తా 6 నెల‌లు ఎప్ప‌టిలాగే పాత వాతావ‌ర‌ణంలో గ‌డిచిపోయాయి. అయితే ఇప్పుడు క్రికెట్ ప్రేమికులు అంతా ఒక్క‌టే చ‌ర్చించుకుంటున్నారు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఈ ఏడాది ఎక్కువ వికెట్లు ఎవ‌రు తీశార‌ని. టెస్ట్‌, వ‌న్డే, టీ20 ఇలా ఏ ఫార్మాట్‌లో ఎవ‌రు ఎన్ని వికెట్లు తీశార‌ని లెక్క‌లు క‌డుతున్నారు.

టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసింది మ‌నోడే

టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసింది మ‌నోడే

ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో ఎక్కువ వికెట్లు తీసిన ఘ‌న‌త టీమిండియా ఆట‌గాడికే ద‌క్కింది. భార‌త జ‌ట్టు సీనియ‌ర్ బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆ రికార్డును ద‌క్కించుకున్నాడు. ఈ ఏడాది మొత్తంలో 8 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌.. 16 ఇన్నింగ్స్‌ల్లో 52 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఓ ఇన్నింగ్స్‌లో అత్య‌ధికంగా 6 వికెట్లు ప‌డ‌గొడితే.. మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మొత్తంగా 365.1 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన అశ్విన్‌.. కేవ‌లం 2.31 ఏకాన‌మీతో 844 ప‌రుగులు ఇచ్చాడు. 78 ఓవ‌ర్ల‌ను మెయిడిన్‌గా వేశాడు. ఇక అశ్విన్ త‌ర్వాత రెండో స్థానంలో పాకిస్థాన్ బౌల‌ర్ షాహిన్ షా ఆఫ్రిదీ ఉన్నాడు. అత‌ను 9 టెస్టు మ్యాచ్‌ల్లో 47 వికెట్లు తీశాడు. ఇక నాలుగో స్థానంలో మ‌రో భార‌త స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ ఉన్నాడు. అత‌డు 5 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

వ‌న్డేల్లో ఎక్కువ వికెట్లు తీసింది వీరే

వ‌న్డేల్లో ఎక్కువ వికెట్లు తీసింది వీరే

ఇక వ‌న్డేల విష‌యానికి వ‌స్తే శ్రీ‌లంక బౌల‌ర్ పీవీడీ చమీర ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలో మొద‌టి స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది 14 మ్యాచ్‌లు ఆడిన చ‌మీర 20 వికెట్లు తీశాడు. అత‌ని త‌ర్వాత రెండో స్థానంలో ఐర్లాండ్ ఆట‌గాడు సిమి సింగ్ ఉన్నాడు. సిమి.. 13 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. మూడో స్థానంలో బంగ్లాదేశ్ బౌల‌ర్ ముస్తిఫిజ‌ర్ ర‌హ‌మాన్ ఉన్నాడు. ర‌హ‌మాన్ 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు.

 టీ20ల్లో ఎక్కువ వికెట్ల జాబితా ఇదిగో

టీ20ల్లో ఎక్కువ వికెట్ల జాబితా ఇదిగో

ఈ ఏడాది అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌల‌ర్‌గా శ్రీ‌లంక‌కు చెందిన డి సిల్వా మొద‌టి స్థానంలో నిలిచాడు. సిల్వా 20 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ త‌ర్వాతి ప్లేసులో సౌతాఫ్రికాకు చెందిన షంసీ ఉన్నాడు. షంసీ కూడా 22 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మూడో స్థానంలో ఉగాండ జ‌ట్టుకు చెందిన నక్రాణి ఉన్నాడు. అత‌డు 22 మ్యాచ్‌ల్లో 35 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Story first published: Saturday, December 25, 2021, 16:41 [IST]
Other articles published on Dec 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+