For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్లో టాప్-5 సెలబ్రేషన్స్.. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్

 CSK sign Matheesha Pathirana as Adam Milne’s replacement for rest of the season

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్‌ ఇప్పటివరకు మాంచి క్రికెట్ మజాను అందించింది. ఐపీఎల్లో క్రికెట్ అంటే కేవలం క్రీడా మాత్రమే కాదు కిక్కిచ్చే వినోదం కూడా.. 15ఏళ్లలో ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చారు. తమ అద్భుత ప్రదర్శనల ద్వారా గొప్ప గొప్ప అవకాశాలు అందుకున్నారు. క్రికెట్‌ అంటే కేవలం బ్యాట్, బాల్‌తో ఆడే ఆట మాత్రమే కాదు. ఇక్కడ ఎమోషనల్ టచ్ టన్నుల కొద్దీ ఉంటుంది. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో ప్లేయర్లు ఆటలో ఎంతో లీనమైపోతుంటారు. ప్లేయర్లు వికెట్లు తీసినప్పుడు కానీ, ఒక స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నప్పుడు గానీ వారి సంబరాలు మాములుగా ఉండవు. కొంతమంది ఆటగాళ్ల సెలబ్రేషన్స్ ఒక ట్రేడ్ మార్క్‌గా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. ఈ సీజన్లో ప్లేయర్లు మైదానంలో చూపించిన సంబరాల్లో టాప్-5 సెలెబ్రేషన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

యజ్వేంద్ర చాహల్.. కులాసా పోజుతో చిల్

యజ్వేంద్ర చాహల్.. కులాసా పోజుతో చిల్

యజ్వేంద్ర చాహల్ ప్రతిభావంతుడైన లెగ్ స్పిన్నర్. చాహల్ ఇటీవల కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్లో తన తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఐదు వికెట్ల హాల్‌ను అందుకున్నాడు. 2019లో వరల్డ్‌కప్ సందర్భంగా బౌండరీ అవతల అతను కూర్చున్న ఫోటోను మీమర్స్ తెగ వాడుకున్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో అతను హ్యాట్రిక్ తీసిన అనంతరం అప్పటి పోజుతో కులాసాగా కూర్చుని స్టేడియం వంక చూసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

డ్వేన్ బ్రావో.. స్టెప్పులు అదరహో

డ్వేన్ బ్రావో.. స్టెప్పులు అదరహో

వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో వికెట్ తీసుకున్నప్పుడు లేదా క్యాచ్ పట్టినప్పుడు విలక్షణమైన వెస్ట్ ఇండియన్ స్టైల్లో డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటాడు. ఈ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్‌ను ఔట్ చేసిన తర్వాత బ్రావో తన ఫేమస్ హుక్ స్టెప్ వేశాడు. బ్రావో కుడిచేతిని చాచి చూపుడు వేలును తిప్పుతూ, కుడిచేత్తో నడుము ఊపుతూ హుక్ స్టెప్ వేశాడు. అలాగే బ్రావో డిఫెరెంట్ డిఫెరెంట్ స్టెప్పులు కూడా వేస్తుంటాడు.

సిరాజ్.. సంబరాల్లో సియు స్టైల్

సిరాజ్.. సంబరాల్లో సియు స్టైల్

మహ్మద్ సిరాజ్ గత రెండేళ్లలో టీమిండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ ఫాస్ట్ బౌలర్‌గా పేరొందాడు. సిరాజ్ మ్యాచ్‌లో భాగంగా వికెట్లు తీసినప్పుడు, క్యాచ్ పట్టినప్పుడు ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో ​​రొనాల్డో టైపులో 'సియు' స్టెప్పులతో సెలబ్రేట్ చేసుకుంటాడు. ఈ సీజన్లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో భానుక రాజపక్సను ఔట్ చేసిన అనంతరం సియు స్టెప్పేసి ఆకట్టుకున్నాడు.

హసరంగా.. సెలబ్రేట్ జోరుగా

హసరంగా.. సెలబ్రేట్ జోరుగా

శ్రీలంకకు చెందిన స్టార్ లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగాను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ సీజన్లో జరిగిన రెండో గేమ్‌లో అతను నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఈ సందర్భంగా అతను స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ గోల్ చేసినప్పుడు సెలబ్రేట్ చేసుకునేలా హసరంగా వికెట్లు తీసినప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాడు. రెండు చేతులను కాస్త పైకి లేపి వేళ్లలో చిటికిన వేలు, బొటనవేలు మినహా మిగతా వేళ్లు మడిచి ఊపుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఉమేష్ యాదవ్.. చేతులు కట్టుకుని

ఉమేష్ యాదవ్.. చేతులు కట్టుకుని

ఉమేష్ యాదవ్ టీమిండియా ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. ఉమేష్ ఈ ఐపీఎల్ సీజన్‌ను మంచి ప్రదర్శనతో ప్రారంభించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కొన్ని విన్నింగ్ స్పెల్‌లు కూడా వేశాడు. ఓవర్‌కు 7.39ఎకానమీతో 7మ్యాచ్‌ల్లో 10వికెట్లు తీసిన ఉమేష్ పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ అనూజ్ రావత్‌ను డక్ ఔట్ చేసిన సందర్భంగా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ ఎంబాప్పే స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. రెండు చేతులు కట్టుకుని చాలా శ్రద్ధగా ఉన్నట్లు ఈ సెలబ్రేషన్ వెరైటీగా ఉంటుంది.

Story first published: Thursday, April 21, 2022, 18:19 [IST]
Other articles published on Apr 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+