Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జింబాబ్వే బౌలింగ్ కోచ్‌ పదవికి మకాయి ఎన్తీని రాజీనామా

Players, staff unhappiness forced me to step down: Ntini

హైదరాబాద్: జింబాబ్వే బౌలింగ్ కోచ్ దక్షిణాఫ్రికా మాజీ ఫేస్ బౌలర్ మకాయి ఎన్తీని తన బౌలింగ్ పదవికి రాజీనామా చేశాడు. అయితే అతను రాజీనామా ప్రకటించిన వెంటనే పై అధికారులు ఆమోదం తెలపడం గమనార్హం. 40 సంవత్సరాలు మఖయ తన రెండేళ్ల ఒప్పందాన్ని జింబాబ్వే జట్టుతో కుదుర్చుకున్నాడు.

ఈ మధ్యలోనే తను రాజీనామా ఉద్దేశ్యాన్ని బయటపెట్టాడు. దానికి స్పందించిన యాజమాన్యం వెంటనే ఆమోదం తెలిపింది. అంతేగాక, ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అంటూ అభినందనలు కూడా తెలియజేసింది.

మే 2016 నుంచి ఇదే జట్టుతో కొనసాగుతున్న మఖయా కొద్ది నెలల క్రితమే తన శాశ్వత కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఆ జట్టు మఖయ సేవలు పొందుతూనే ఉంది. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఇంకోటి ఉంది. బంగ్లాదేశ్‌కు జింబాబ్వేకు మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది.

జట్టులోని ఆటగాళ్ల జాబితా విడుదల చేయగానే మఖయ రాజీనామాను ప్రకటించడం శోచనీయం. ఆటగాళ్లతో పాటు సిబ్బంది సహా రాజీనామా చేయాలని పట్టుబట్టారు.

'నిజం చెప్పాలంటే నేను రాజీనామా చేయాలనుకోలేదు. నాకు అనుకోకుండా మేనేజింగ్ డైరక్టర్ దగ్గరనుంచి మెసేజ్ వచ్చింది. మనం సమావేశమవ్వాలి' అని ఉంది. అయితే కలిసిన తర్వాత చెప్పిన విషయం 'నా వల్ల కొంతమంది ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు. నేను తప్పుకుంటే బాగుంటుందన్నట్లుగా పరోక్షంగా చెప్పాడు. దీంతో తాను ఈ కీలక నిర్ణయం తీసుకున్నానని ఎన్తీని ఆవేదనను వ్యక్తం చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 8, 2018, 13:21 [IST]
Other articles published on Jan 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+